Baba Ramdev: యోగా గురువు బాబా రాందేవ్‌పై అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే..
ABN , Publish Date - Feb 02 , 2025 | 02:34 PM
Patanjali Case: యోగా గురువు బాబా రాందేవ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఏ కేసులో ఆయనకు వారెంట్ ఇచ్చారు? అసలు ఆయన చేసిన తప్పు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయనతో పాటు పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణకు కూడా కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. పతంజలి కంపెనీకి చెందిన దివ్య ఫార్మసీ వైద్య విధానాల మీద తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారనే ఆరోపణల మీద కేరళలో కేసు నమోదైంది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలతో పాటు తప్పుడు ప్రచారాలు చేశారనే అభియోగాల నేపథ్యంలో అక్కడి డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు. ఈ కేసుపై పాలక్కడ్ జిల్లా కోర్టు ఇన్వెస్టిగేషన్ చేపట్టింది.
విచారణకు రావాల్సిందే!
ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణను పాలక్కడ్ కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 1న ఇన్వెస్టిగేషన్‌కు అటెండ్ కావాలని న్యాయస్థానం ఆదేశించినా వాళ్లు హాజరుకాలేదు. దీంతో బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఇదే నెల 15వ తేదీన తిరిగి విచారణ చేపడతామని తెలిపింది. కాగా, జనాలను తప్పుదోవ పట్టించే ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే పతంజలికి చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దయ్యాయి. ఇప్పుడు సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్, ఎండీ ఆచార్య బాలకృష్ణ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
ఇవీ చదవండి:
మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
రక్షణ శాఖకు అంతంతే!
సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి