Share News

Saif Ali Khan: ఇది అస్సలు ఊహించలే.. సైఫ్‌ అలీఖాన్‌ కేసులో ట్విస్ట్‌

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:08 AM

Saif Ali Khan case: కొన్ని నెలల క్రితం సైఫ్ అలీఖాన్‌పై ఆయన ఇంట్లోనే దాడి జరిగింది. ఈ దాడిలో సైప్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు షరీఫుల్‌ ఇస్లామ్‌ షెహజాద్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

Saif Ali Khan: ఇది అస్సలు ఊహించలే.. సైఫ్‌ అలీఖాన్‌ కేసులో ట్విస్ట్‌
Saif Ali Khan

సైఫ్ అలీఖాన్ కేసులో ఎవ్వరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో మతి పోయే విషయం వెలుగులోకి వచ్చింది. సైఫ్ ఇంట్లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్‌తో.. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు షరీఫుల్‌ ఇస్లామ్‌ షెహజాద్‌ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదని సమాచారం. దాడి జరిగిన రోజు సంఘటనా స్థలం నుంచి ముంబై పోలీసులు 20 సెట్ల ఫింగర్ ప్రింట్లను సేకరించారు. వాటిని నిందితుడి ఫింగర్ ప్రింట్స్‌తో పోల్చగా.. సంఘటనా స్థలంలో దొరికిన ఫింగర్ ప్రింట్స్.. నిందితుడి ఫింగర్ ప్రింట్స్ వేరని తేలింది.


తేల్చేసిన సీఐడీ

2025, జనవరి 15వ తేదీన సైఫ్ అలీఖాన్‌పై ఆయన ఇంట్లోనే కత్తి దాడి జరిగింది. దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ముంబై పోలీసులు బాంద్రాలోని ఆయన ఇంటికి వెళ్లారు. క్లూస్ టీం అక్కడ 20 సెట్ల ఫింగర్ ప్రింట్స్ తీసుకుంది. ఆ ఫింగర్ ప్రింట్స్ అనాలసిస్ కోసం సీఐడీ దగ్గరకు వెళ్లాయి. ఆ 20 సెట్లతో.. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అదుపులోకి తీసుకున్న నిందితుడు షరీఫుల్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. టెస్ట్ రిపోర్టులు నెగిటివ్ వచ్చిన విషయాన్ని సీఐడీ.. ముంబై పోలీసులకు తెలిపింది. మరిన్ని ఫింగర్ ప్రింట్ శాంపిల్స్ పంపితే.. వాటిని కూడా పరీక్షిస్తామని పేర్కొంది.


ఛార్జ్‌షీటులో వెలుగులోకి అసలు విషయాలు

ముంబై పోలీసులు సైఫ్ అలీఖాన్ కేసుకు సంబంధించి తాజాగా 1600 పేజీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అందులో ఫింగర్ ప్రింట్లకు సంబంధించిన విషయాలు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఛార్జ్‌షీటులో ముఖం, వేలి ముద్రలు, ఐడెంటిఫికేషన్ పెరేడ్‌, ఫోరెన్సిక్ ల్యాబ్‌ పరిశోధనలకు సంబంధించిన విషయాలు కూడా అందులో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

Honeytrap: రూ.13 వేల కోట్ల స్కాం.. మెహుల్ చోక్సీ హనీట్రాప్ నిజమా.. కాదా..

Loan Rates: గుడ్ న్యూస్..రుణ గ్రహితలకు తగ్గనున్న లోన్ ఈఎంఐలు..

Updated Date - Apr 15 , 2025 | 11:42 AM