Maternal Deaths: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత సంచలన ఆరోపణలు
ABN, Publish Date - Jan 02 , 2025 | 05:24 PM
Maternal Deaths: కర్ణాటకలో పెరుగుతోన్న ప్రసూతి మరణాలపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనిపై సీబీఐతోకానీ.. జ్యూడిషియల్ విచారణ కానీ జరిపించాలని డిమాండ్ చేసింది.
బెంగళూరు, డిసెంబర్ 02: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో సంభవిస్తున్న ప్రసూతి మరణాల వెనుక డ్రగ్ మాఫియా ఉందని.. దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. గురువారం బెంగళూరులో ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు ఆర్ అశోక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెరుగుతోన్న ప్రసూతి మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న ఈ ప్రసూతి మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రాయచూర్ లో 11 మంది మహిళలు, బెళగావిలో రాధిక అనే మహిళ, తిప్తుతూర్ లో ముస్లిం మహిళ మరణించారని ఆయన సోదాహరణగా వివరించారు. గతేడాది కర్ణాటకలో 736 ప్రసూతి మరణాలు సంభవించాయని గుర్తు చేశారు. వైద్య శాఖ విభాగం వినియోగిస్తున్న 462 మందుల్లో నాణ్యత లేదని విమర్శించారు. ప్రభుత్వం తీసుకొంటున్న ఈ తరహా చర్యల వల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని మార్చాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సమర్థవంతంగా పని చేసే వారికి ఆ పదవి అప్పగించాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఈ ప్రసూతి మరణాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి.. నిజా నిజాలను వెలుగులోకి తీసుకు రావాలన్నారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఎన్ని ప్రసూతి మరణాలు సంభవించాయో.. లెక్క తేల్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: లాలు ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం నితీష్ కుమార్
ఈ అంశాన్ని సీబీఐతో లేదా జ్యూడిషియల్ కమిటీతో కానీ దర్యా్ప్తు చేయించాలని ప్రభుత్వానికి సూచించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇవేమీ చేయకుండా.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఆరోగ్య శాఖ పూర్తిగా మెడికల్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో సైతం లేవనెత్తుతామని ప్రతిపక్ష నేత అశోక్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read: బీఎస్ఎఫ్‍పై సీఎం మమత ఆరోపణలు.. స్పందించిన బీజేపీ
For National News And Telugu News
Updated Date - Jan 02 , 2025 | 05:25 PM