Pre school Blackmail: ముద్దుకు రూ 50 వేలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:19 AM
బెంగళూరులో ప్రీస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఇద్దరు రౌడీషీటర్లు వ్యాపారిని బెదిరించి డబ్బు డిమాండ్ చేశారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు

వ్యాపారిపై వలపు వల.. రూ.17 లక్షలు వసూలు
చాట్ డిలీట్ చేసేందుకు అర కోటి డిమాండ్
ప్రీస్కూల్ నిర్వాహకురాలు, ఇద్దరు రౌడీషీటర్ల అరెస్టు
బెంగళూరు, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఓ వ్యాపారిపై వలపు వల విసిరి.. డబ్బు కోసం బెదిరించిన ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ సహా, ఇద్దరు రౌడీషీటర్లను బెంగళూరు సీసీబీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.బెంగళూరు మహాలక్ష్మి లే అవుట్‌లో శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన వ్యాపారి తన పిల్లలను 2023లో ఆ స్కూల్లో చేర్చారు. ఈ క్రమంలో ఆయనతో శ్రీదేవికి పరిచయమైంది. పాఠశాల నిర్వహణ, ఇతర అవసరాలకు అతని నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకుని, 2024లో తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది. ఆ తరువాత వారి మధ్య స్నేహం కాస్త ముందుకెళ్లింది. మొదట్లో ఒక ముద్దు పెట్టేందుకు శ్రీదేవి ఏకంగా రూ.50 వేలు వసూలు చేసింది. అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో వ్యాపారి అడగడంతో ఏం కావాలో చెబితే.. ఒకేసారి ఫైనాన్స్ వ్యవహారాలు సెటిల్ చేసుకుందామని శ్రీదేవి ప్రతిపాదించింది. లివ్ ఇన్ రిలేషన్‌షి్‌పలో ఉందామని చెప్పి.. అత్యవసరంగా రూ.15 లక్షలు అడిగి తీసుకుంది. ఫిబ్రవరిలో మరోసారి డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో విసుగు చెందిన వ్యాపారి ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మార్చి 12న వ్యాపారి భార్యకు శ్రీదేవి ఫోన్ చేసి, ‘మీ పిల్లల టీసీలు ఇస్తాం. మీ భర్తను పంపండి’ అని సూచించింది. ఈ మేరకు ఆయన పాఠశాల వద్దకు వెళ్లేసరికి బిజాపూర్‌కు చెందిన రౌడీషీటర్లు గణేశ్ కాలె, సాగర్ మొరె అక్కడ ఉన్నారు. వాగ్వాదం తరువాత వ్యాపారి ఇంటికి వెళ్లి కోటి రూపాయలు డిమాండ్ చేశారు.
చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.1.90 లక్షలు తీసుకుని వదిలేశారు. మార్చి 17న వ్యాపారికి శ్రీదేవి ఫోన్ చేసి రూ.50 లక్షలు ఇస్తేఅశ్లీల వీడియోలు, చాటింగ్ డిలీట్ చేస్తానని, లేదంటే నీ భార్యకు పంపుతానని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో వ్యాపారి నేరుగా సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, ప్రీస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవితోపాటు గణేశ్ కాలె, సాగర్ మొరెను అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..
Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి
Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు
Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్
For Latest National News , National News in Telugu