Byelections 2025: మిల్కీపూర్, ఈరోడ్ ఉప ఎన్నికల తేదీ ప్రకటన
ABN, Publish Date - Jan 07 , 2025 | 05:49 PM
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో యూపీలోని మల్కిపురిలో ఉపఎన్నిక అనివార్యం అయింది. ఎన్నికల పిటిషన్ కారణంగా గత అక్టోబర్‌లో మిల్కీపూర్‌లో ఉప ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్ (Milkipur), తమిళనాడులోని ఈరోడ్ ఉప ఎన్నికల తేదీని కూడా మంగళవారంనాడు ప్రకటించింది. ఈ రెండు ఉప ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న నిర్వహిస్తామని, ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. జనవరి 17వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుందని, నామినేషన్ల పరిశీలన 18వ తేదీ, నామినేషన్ల ఉపసంహరణ 20వ తేదీతో ముగుస్తుందని ప్రకటించింది.
Atishi: సీఎం నివాసం నుంచి నన్ను మళ్లీ గెంటేశారు.. అతిషి సంచలన వ్యాఖ్యలు
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో యూపీలోని మల్కిపురిలో ఉపఎన్నిక అనివార్యం అయింది. ఎన్నికల పిటిషన్ కారణంగా గత అక్టోబర్‌లో మిల్కీపూర్‌లో ఉప ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అయితే హైకోర్టు లక్నోబెంచ్ నవంబర్ 25న మిల్కీపూర్ అసెంబ్లీ సీటుకు సంబంధించిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో ఉప ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడానికి మార్గం సుగమమైంది. కాగా, కాంగ్రెస్ నేత ఈవీకేఎస్ ఇలాంగోళవన్ మృతి కారణంగా తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కీపూర్, ఈరోడ్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. కాగా, బుద్గాం, నగ్రోటా ఉప ఎన్నికల నిర్వహణలో మంచుకారణంగా జాప్యం తలెత్తిందని, ఏప్రిల్ 20లోగా ఎన్నికలు జరగాల్సి ఉందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఒమర్ అబ్దుల్లా రాజీనామాతో బుద్గాం, దేవిందర్ సింగ్ రాణా మృతితో నగ్రోటా ఉప ఎన్నిక అనివార్యమైంది.
Nirmala Sitharaman: విశాఖ ఉక్కును విక్రయించొద్దు!
Earthquake: భారత్‌లో భారీ భూకంపం..భయాందోళనలో జనం
Read Latest National News and Telugu News
Updated Date - Jan 07 , 2025 | 05:51 PM