Priyanka: ప్రియాంక గాంధీకి పదోన్నతి..కాంగ్రెస్ కసరత్తు
ABN , Publish Date - Apr 14 , 2025 | 05:39 PM
ప్రియాంక గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ నిర్దిష్ట బాధ్యతలు లేవు. అయితే ఇటీవల జిల్లా అధ్యక్షులకు పార్టీలో కీలక పాత్ర ఉంటుందని ఖర్గే ప్రకటించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించడం వెనుక ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది. అహ్మదాబాద్‌లో ఇటీవల ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం, ఏఐసీసీ ప్లీనరీలో ఈ మేరకు చాలా స్పష్టమైన సందేశాలు ఇచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కీలక మార్పులకు కసరత్తు చేస్తోంది. పార్టీ కోసం పనిచేసే వాళ్లు ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్లు రిటైర్ కావచ్చు..అంటూ మల్లికార్జున్ ఖర్గే అహ్మదాబాద్ ప్లీనరీలో స్పష్టమైన హెచ్చరికలు సైతం చేశారు. పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) ఎలాంటి కీలక పాత్ర అప్పగించనున్నారనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనిపై పార్టీ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ అంతర్గత చర్యల్లో దీనిపై ప్రధానంగా చర్చ జరుగుతోందని, పార్టీ ఉపాధ్యక్ష పదవికి ప్రియాంకను ప్రమోట్ చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Mallikarjun Kharge: బాబాసాహెబ్‌కు అప్పుడూ ఇప్పుడూ కూడా వాళ్లే శత్రువులు: ఖర్గే
ప్రియాంక గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ నిర్దిష్ట బాధ్యతలు లేవు. అయితే ఇటీవల జిల్లా అధ్యక్షులకు పార్టీలో కీలక పాత్ర ఉంటుందని ఖర్గే ప్రకటించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించడం వెనుక ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు. జిల్లా అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ కీలక అధికారాలు అప్పగించాలని నిర్ణయం గుజరాత్‌తోనే ప్రారంభిస్తోంది. జిల్లా్ స్థాయి నేతలకు అధికారుల ఇవ్వడం ద్వారా పార్టీ అట్టడుగు స్థాయి నుంచి బలపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు గుజరాత్‌లో విజయవంతమైతే ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలనే ఆలోచన పార్టీ అధిష్ఠానం ఉంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు విస్తృతమైన సంస్థాగత మార్పులపై అధిష్ఠానం ముమ్మర కసరత్తు చేస్తోంది. పార్టీ అంతర్గత వ్యవస్థ, నిర్వహణా సామర్థ్యాన్ని పెంచుకోవాలని, తద్వారా పార్టీ మరింత సమర్థవంతంగా పనిచేసి భవిష్యత్ సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతుందని అధిష్ఠానం భావస్తోంది. ప్రియాంక గాంధీకి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయడంలో ప్రియాంక కీలకంగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..