Kangana Ranaut: 2 నిమిషాల ఫేమ్ కోసమే ఇదంతా.. కునాల్‌పై కంగన మండిపాటు

ABN, Publish Date - Mar 25 , 2025 | 03:37 PM

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి 'ద్రోహి' అంటూ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలపై కంగన రనౌత్ స్పందించారు.

Kangana Ranaut: 2 నిమిషాల ఫేమ్ కోసమే ఇదంతా.. కునాల్‌పై కంగన మండిపాటు

ముంబై: రెండు నిమిషాల ఫేమ్ కోసం ఒకరిని విమర్శించే వ్యాఖ్యలు చేస్తున్నారంటే సమాజం ఎక్కడికి వెళ్తోందో ఆలోచించాలని బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) అన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి 'ద్రోహి' అంటూ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా (Kunal Kamra) చేసిన వ్యాఖ్యలపై కంగన ఈమేరకు స్పందించారు.

Delhi Budget 2025: లక్ష కోట్లతో చారిత్రక బడ్జెట్


''రెండు నిమిషాల గుర్తింపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే సమాజం ఎటువైపు పోతోందో మనమంతా ఆలోచించాలి. మీరు ఎవరైనా కావచ్చు, కానీ ఒక వ్యక్తిని అవమానించడం, అప్రతిష్టపాలు చేయాలనుకోవడం సరికాదు. అసలు వీళ్లంతా ఎవరు? వారి విశ్వసనీయత ఏమిటి? వాళ్లు విమర్శించాలనుకుంటే సాహిత్య ప్రక్రియతో ఆ పని చేయవచ్చు. కానీ కామెడీ పేరుతో మన సంస్కృతిని, ప్రజలను దూషిస్తు్న్నారు'' అని కంగన వ్యాఖ్యానించారు.


కునాల్ వ్యా్ఖ్యల వివాదానికి సంబంధించి వేదికను కూల్చడం చట్టబద్ధంగానే జరిగిందని కంగనా అన్నారు. అయితే తన బంగ్లాను మాత్రం చట్టవిరుద్ధంగా కూల్చారని వాపోయారు. 2020లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని ముంబై నగర పాలక సంస్థ బీఎంసీ బాంద్రాలోని కంగనా కార్యాలయంలో కొంత భాగాన్ని కూల్చేసింది. దీనిపై కంగనా ముంబై హైకోర్టును ఆశ్రయించగా, బీఎంసీని హైకోర్టు మందలిస్తూ జరిగిన నష్టాన్ని పూడ్చాలని ఆదేశించింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ హత్య కేసులో కంగనా, శివసేన మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో ఈ కూల్చివేత ప్రక్రియ చోటుచేసుకుంది.


కునాల్ వ్యవహారానికి వస్తే.. హబిటాట్ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో షిండేను ద్రోహిగా పోలుస్తూ 'దిల్ తో పాగల్ హై' అనే హిందీ గీతాన్ని పారడీ చేసి అమానకర రీతిలో కునాల్ పాడారు. దీంతో శివసేన కార్యకర్తలు స్టూడియోపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. విధ్వంసకారులతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కునాల్‌పై కూడా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో హబిటాల్ స్టూడియోలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బీఎంసీ కూల్చేసింది.


ఇవి కూడా చదవండి..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

High Court: దేవుళ్లు సరిగానే ఉన్నారు... కొందరు మనుషులే తేడా..

Read Latest and National News

Updated Date - Mar 25 , 2025 | 03:41 PM