గడ్డకట్టే చలిలోనూ నాగసాధువులు నగ్నంగా ఉంటారు.. రహస్యమిదే..
ABN, Publish Date - Jan 13 , 2025 | 01:57 PM
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా పుష్యపౌర్ణమి రోజున(జనవరి 13వ తేదీ) ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరందరిలోకి భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మహా కుంభమేళాకు హాజరైన నాగసాధువులు. నాగసాధువులు మాత్రం బట్టలు ధరించకున్నా గడ్డకట్టించే చలిలోనూ తట్టుకుని ఎలా నిలబడగలిగారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. దీని వెనక ఉన్న రహస్యమిదే..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా పుష్యపౌర్ణమి రోజున(జనవరి 13వ తేదీ) ఘనంగా ప్రారంభమైంది. 144 ఏళ్లకు ఓ సారి మాత్రమే జరిగే మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచింది. తెల్లవారుజాము నుంచే గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరందరిలోకి భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మహా కుంభమేళాకు హాజరైన నాగసాధువులు. ప్రయగరాజ్లో తీవ్రమైన చలి ఉండటంతో సాధారణ భక్తులు స్నానమాచరించే సమయంలో గజగజ వణికిపోతున్నారు. నాగసాధువులు మాత్రం బట్టలు ధరించకున్నా గడ్డకట్టించే చలిలోనూ తట్టుకుని ఎలా నిలబడగలిగారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. మైనస్ డిగ్రీల చలినీ సహించగల శక్తి నాగసాధవులకు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని ఆశ్చర్యపోతున్నారు. దీని వెనక ఉన్న రహస్యమిదే..
45 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించేందుకు తొలిరోజు నుంచే పెద్ద సంఖ్యలో నాగసాధువులు, అఘోరాలు, సన్యాసులు హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. బట్టలు వేసుకోకుండా కేవలం బూడిదతో కప్పబడిన శరీరంతో తీవ్రమైన చలిని భరించగల సామర్థ్యం ఎలా వచ్చిందని భక్తులు ఆశ్యర్యంతో నోరెళ్లబడుతున్నారు.
నాగాలు ఎప్పటి నుంచి ఉన్నారు?
శంకరాచార్యుడు నాలుగు మఠాలను స్థాపించిన తర్వాత వాటి భద్రత గురించి ఆందోళన చెంది నాగ సాధువుల బృందం ఏర్పాటు చేశాడని అంటారు. నాగ సాధువుగా మారడం అనేది ఒక సవాలుతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇతర సాధువుల మాదిరిగా కాకుండా, నాగ సాధువులు హఠ యోగాను అభ్యసిస్తారు. ఈ సారి మహా కుంభమేళాకు హాజరైన కొందరు నాగసాధువులు తమ ప్రత్యేకతతో అందరి చూపు తమవైపు తిప్పుకున్నారు. ఒక నాగ సాధువు అనేక సంవత్సరాలుగా 1.25 లక్షల రుద్రాక్షలను ధరించగా.. మరొక సాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచాడు. నాగసాధువులు ఎంత అంకితభావంతో ఉంటారో చెప్పేందుకు వీరిద్దరే నిదర్శనం.
నాగ సాధువులకు చలి ఇందుకే వేయదు..
సున్నా డిగ్రీల చలిలోనూ బట్టలు ధరించని నాగ సాధువులు ఎటువంటి అసౌకర్యానికి గురికారు. వైద్య శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నా ఇదే నిజం. వైద్య అధ్యయనాల ప్రకారం, మానవులు సరైన దుస్తులు లేకుండా మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద సుమారు 2.5 గంటలు మాత్రమే జీవించగలరు. రెండు పొరల దుస్తులతో వారు 15 గంటలు జీవించగలరు. అయితే, నాగ సాధువులు ఈ శాస్త్రీయ విధానాన్ని పటాపంచలు చేస్తూ విపరీతమైన చలిని తట్టుకోగలరు. వారి రహస్య ఆధ్యాత్మిక అభ్యాసాలే ఈ సామర్థ్యం వెనకగల రహస్యం. అన్ని రుతువులను తట్టుకోవడానికి నాగసాధువులు ఈ 3 రకాల సాధనలను చేస్తారు.
అగ్ని సాధన : నాగ సాధువులు తమ శరీరంలోని అగ్ని మూలకాన్ని ప్రేరేపించేందుకు ఒక రకమైన ధ్యానాన్ని అభ్యసిస్తారు. ఈ అంతర్గత వేడి వారి శరీరాలను కఠినమైన పరిస్థితుల్లో వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది.
నాడీ శోధన : ప్రాణాయామం ద్వారా నాగాలు తమ శరీరంలోని గాలి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తారు. ఇది శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధంగా, వెచ్చగా ఉండేలా చూస్తుంది.
మంత్ర పఠనం: నాగ సాధువులు మంత్రాలను పఠించడం ద్వారా వారి శరీరంలో శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి చల్లని ఉష్ణోగ్రతలు తట్టుకోగలిగేలా చేస్తుంది.
బూడిద : నాగ సాధువులు వారి శరీరాన్ని కప్పి ఉంచే బూడిదలో బూడిదలో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుంచి కాపాడతాయి. అంటే బూడిద ఇన్సులేటింగ్ పొరగా పనిచేస్తుంది.
Updated Date - Jan 13 , 2025 | 01:57 PM