ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Arvind Kejriwal: ఆ పని చేస్తే నేను పోటీ చేయను.. అమిత్‌షాకు కేజ్రీ సవాల్

ABN, Publish Date - Jan 12 , 2025 | 03:20 PM

రాబోయే ఐదేళ్లలో మురికివాడలన్నింటినీ కూల్చేసి, వేలాది మంది కుటుంబాలను నిరాశ్రయులను చేయాలన్నదే బీజేపీ ఆలోచన అని కేజ్రీవాల్ ఆరోపించారు. మురికివాడలు కూల్చకుండా అడ్డుకున్న క్రెడిట్ తమ (ఆప్) ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

న్యూఢిల్లీ: మురికివాడల్లో నివసించే ప్రజల పట్ల బీజేపీకి ఎలాంటి ప్రేమా లేదని, ఇంతవరకూ వారి సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం వారి చుట్టూ తిరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ''ఎక్కడ మురికివాడ ఉంటుందో అక్కడ ఇల్లు ఉంటుంది'' అంటూ బీజేపీ చేసిన నినాదం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని అన్నారు. ఆ ఇల్లు ఎవరిదో ఎప్పుడూ వాళ్లు చెప్పింది లేదని, ధనవంతులైన తన బిల్డర్ ఫ్రండ్స్‌ కోసం మురికివాడలను లాగేసుకుని ఆ స్థాన్ ఇళ్లు కట్టాలన్నదే బీజేపీ నినాదం వెనుక అసలు నిజమని ఆయన చెప్పారు. ఆ డబ్బున్న ఫ్రెండ్స్ ఎవరో అందరికీ తెలిసిందేనని కేజ్రీవాల్ అన్నారు.

S.Jaishankar: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఎస్.జైశంకర్


ఐదేళ్లలో మురికివాడలన్నీ కూల్చేస్తారు

రాబోయే ఐదేళ్లలో మురికివాడలన్నింటినీ కూల్చేసి, వేలాది మంది కుటుంబాలను నిరాశ్రయులను చేయాలన్నదే బీజేపీ ఆలోచన అని కేజ్రీవాల్ ఆరోపించారు. మురికివాడలు కూల్చకుండా అడ్డుకున్న క్రెడిట్ తమ (ఆప్) ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ''నేను ఇక్కడ లేకపోయి ఉంటే పదేళ్ల క్రితమే మురికివాడలను నేలమట్టం చేసేవారు. బీజేపీకి ప్రజల ప్రాణాలంటే లక్ష్యం లేదు, వాళ్ల ధనవంతులైన ఫ్రండ్స్ గురించే ఆలోచన'' అని అన్నారు.


బీజేపీకి వెయ్యేళ్లు పడుతుంది

బీజేపీ గత పదేళ్లలో కేవలం 4,700 ఇళ్లు నిర్మించిందని, ఆ ప్రకారం చూస్తే మురికివాడల్లోని ప్రజానీకానికి ఇళ్లు కట్టించేందుకు బీజేపీకి వెయ్యేళ్లు పడుతుందని కేజ్రీవాల్ అన్నారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచనే బీజేపీకి లేదనేది అసలు వాస్తవమని చెప్పారు. ఢిల్లీలోని ప్రతి స్లమ్‌ను కూల్చేసే సమగ్ర ప్లాన్ బీజేపీకి దగ్గర ఉందని, ఏడాదిలోపు అక్కడి నివాసులను ఖాళీ చేయిస్తుందని, ఏ ఒక్కరినీ విడిచిపెట్టదని హెచ్చరించారు.


అమిత్‌షాకు సవాల్

మురికివాడల్లో నివసించే ప్రజల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ''గత పదేళ్లలో మురికివాడల కూల్చివేతకు సంబంధించిన అన్ని కోర్టు కేసులు అమిత్‌షా ఉపసంహరించుకోవాలని నేను సవాల్ చేస్తున్నాను. నిరాశ్రయులైన కుటుంబాలకు అదే స్థలంలో పునరావాసం కల్పిస్తామనే గ్యారెంటీ ఇస్తూ అఫిడవిట్ సమర్పించాలి. అది చేస్తే నేను ఎన్నికల్లో పోటీ చేయను'' అని కేజ్రీవాల్ అన్నారు. అమిత్‌షా ఇటీవల మురికివాడల ప్రజలను కలుసుకున్నప్పుడు తనపై వాడిన పదజాలం అభ్యంతరకరంగా ఉందని, హోం మంత్రి స్థాయికి ఇది తగదని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేయడమంటే డెత్ వారెంట్‌పై సంతకం చేయడమేనని, ఏడాదిలో మురికివాడలన్నీ కూల్చేస్తారని అన్నారు.


ఇవి కూడా చదవండి..

Hero Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Chief Minister: నాన్న అనే ఆ పిలుపే మా పాలనకు కితాబు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 12 , 2025 | 03:20 PM