Delhi Elections 2025: రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. కాంగ్రెస్ మరో స్కీమ్
ABN, Publish Date - Jan 08 , 2025 | 02:37 PM
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన రెండో వాగ్దానమిది. జనవరి 6న 'ప్యారీ దీదీ యోజన'ను ఆ పార్టీ ప్రారంభించింది. ఈ పథకం కింద ఢిల్లీలోని మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. తాజాగా రెండో స్కీ్మ్‌ను ప్రకటిస్తూ, అధికారంలోకి రాగానే రెండు పథకాలను అమలు చేస్తామని తెలిపింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assmebly Elctions) షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించడంతో ప్రధాన పార్టీలన్నీ హామీలతో దూసుకు వెళ్తున్నాయి. ప్రధానంగా మహిళలకు ఆర్థిక సహాయం, వృద్ధులకు ఉచిత ఆరోగ్యం స్కీమ్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 'జీవన్ రక్షా యోజన' (Jeevan Raksha Yojana) స్కీమ్‌ను బుధవారంనాడు ప్రారంభించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే ఈ పథకం కింద రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేసింది.
HMPV: దేశంలో ఏడుకు చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన రెండో వాగ్దానమిది. జనవరి 6న 'ప్యారీ దీదీ యోజన'ను ఆ పార్టీ ప్రారంభించింది. ఈ పథకం కింద ఢిల్లీలోని మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. తాజాగా రెండో స్కీ్మ్‌ను ప్రకటిస్తూ, అధికారంలోకి రాగానే రెండు పథకాలను అమలు చేస్తామని తెలిపింది.
రూ.25 లక్షల ఆరోగ్య బీమా
జీవన్ రక్షా యోజన పథకాన్ని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రారంభిస్తూ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ పథకాన్ని చేర్చాలని పార్టీ నిర్ణయించిందని అన్నారు. ఈ పథకం కింద రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తామని, రాజస్థాన్‌లోనూ ఇదే తరహా పథకాన్ని తాము ప్రారంభించామని చెప్పారు. ఈ పథకం కింద ప్రజలందరికీ రూ.25 లక్షల వరకూ ఉచిత ఆరోగ్య చికిత్స అందిస్తామని, దీనికి ఎలాంటి షరతులు, ఆంక్షలు ఉండవని చెప్పారు. రాజస్థాన్‌లోని 'చిరంజీవి యోజన' తరహాలో రూపొందించిన పథకం ఇదని, రాజస్థాన్‌లో ఆరోగ్య హక్కు చట్టం తెచ్చామని తెలిపారు. ఇదొక విప్లవాత్మక పథకమని అన్నారు. జీవన్ రక్షా యోచన పథకాన్ని ఇక్కడ కూడా ప్రారంభించేందుకు తనను పిలవడం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీలో ఇదొక 'గేమ్ ఛేంజర్' స్కీమ్ అని, ప్రజల వద్దకు ఈ పథకాన్ని అందరూ తీసుకెళ్లాలని కోరారు.
అసెంబ్లీ ఎన్నికలు 2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను జనవరి 7న ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5న పోలింగ్, ఫిబ్రవరి 8న కౌంటింగ్ ఉంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు 62 సీట్లను ఆప్ గెలుచుకోగా, బీజేపీ 8 సీట్లు దక్కించుకుంది. ఆప్‌కు 53.57 శాతం ఓట్లు పోలవ్వగా, బీజేపీ 38.51 శాతం ఓట్లు కైవసం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Supreme Court: సమాచార కమిషన్ పదవులను తక్షణమే భర్తీ చేయండి
ఎక్కడ దాక్కున్నా పట్టిచ్చే ‘భారత్ పోల్’
Read Latest National News and Telugu News
Updated Date - Jan 08 , 2025 | 02:40 PM