Delhi Elctions: ఎంసీసీ ఉల్లంఘనపై 1,100 కేసులు, 35,000 మంది అరెస్టు
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:49 PM
ఎంసీసీ ఉల్లంఘనల కింద 1,100 కేసులు నమోదు కాగా, 35,000 మందిని అరెస్టు చేసినట్టు శుక్రవారంనాడు ఒక అధికార ప్రకటన వెల్లడించింది. జనవరి 7వ తేదీన ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకూ ఈ కేసుల నమోదు, అరెస్టుల పర్వం చోటుచేసుకుంది.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC)ని ఉల్లంఘించిన వారిపై భారీగా కేసులు నమోదయ్యాయి. పెద్ద సంఖ్యలో అరెస్టులు చోటుచేసుకున్నాయి. ఎంసీసీ ఉల్లంఘనల కింద 1,100 కేసులు నమోదు కాగా, 35,000 మందిని అరెస్టు చేసినట్టు శుక్రవారంనాడు ఒక అధికార ప్రకటన వెల్లడించింది. జనవరి 7వ తేదీన ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకూ ఈ కేసుల నమోదు, అరెస్టుల పర్వం చోటుచేసుకుంది.
AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ
ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన సమాచారం ప్రకారం, వివిధ నిబంధనల కింద ముందస్తు చర్యలు, ఇతర కార్యకలాపాల్లో భాగంగా 35,516 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ ఆయుధాల నిరోధక చట్టం కింద 499 మందిని అరెస్టు చేసి, 477 అక్రమ మారణాయుధాలు, 538 కార్ట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. 1,15,103 లీటర్ల మధ్యం స్వాధీనం చేసుకుని 1,426 మందిని అరెస్టు చేశారు. రూ.77.9 కోట్లు విలువచేసే 206.712 కిలోల మాదక ద్రవ్యాలు, 1.200 నిషేధిత ఇంజక్షన్లు స్వాధీనం చేసుకుని 179 మందిని అరెస్టు చేశారు. రూ.11.70 కోట్ల నగదు, 37.39 కిలోల వెండిని ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి.
ఎల్జీ ఆదేశాలతో..
మరోవైపు, తమ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారంటూ ఆప్ చేసిన ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారంనాడు ఆదేశించారు. దీంతో ఏసీబీ బృందాలు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడాల్సిన నేపథ్యంలో ఎల్జీ తాజా ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ
Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి