Delhi Polls: 'ఓటర్ స్కామ్'పై చర్యలు తీసుకోండి.. సీఈసీకి కేజ్రీ లేఖ
ABN, Publish Date - Jan 11 , 2025 | 09:34 PM
నకిలీ ఓట్లు సృష్టించేందుకు బీజేపీ కొత్త మార్గం ఎంచుకుందని సీఈసీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల తమ ఇంటి అడ్రెస్సులతో నకిలీ ఓట్లు సృష్టించుకుంటున్నారని అన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు (Delhi Assembly Elections) సంబంధించిన ఓటర్ల జాబితాపై రగడ ముదురుతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో 'ఓటర్ స్కామ్' ఆరోపణలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar)కు శనివారంనాడు లేఖ రాశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు.
PM Modi: సోన్‌మార్గ్ టన్నెల్ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: మోదీ
నకిలీ ఓట్లు సృష్టించేందుకు బీజేపీ కొత్త మార్గం ఎంచుకుందని సీఈసీకి రాసిన లేఖలో ఆరోపించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల తమ ఇంటి అడ్రెస్సులతో నకిలీ ఓట్లు సృష్టించుకుంటున్నారని అన్నారు. తక్షణం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అడ్రస్‌తో 33 కొత్త ఓట్ల నమోదుకు అప్లికేషన్ ఇవ్వడం జరిగిందని సీఈసీ దృష్టికి తెచ్చారు. తక్షణం వర్మ అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేయాలని కోరారు.
దీనికి ముందు, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సైతం సీఈసీ అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ రాశారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఎన్నికల జాబితా మానిప్యులేషన్ జరుగుతోందని ఆరోపిస్తూ, వ్యక్తిగతంగా కలుసుకుని వివరాలు తెలియజేసేందుకు తక్షణం అపాయింట్‌మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత ముడురోజుల్లో సీఈసీకి అతిషి లేఖ రాయడం ఇది రెండోసారి. జనవరి 5న కూడా ఓటర్ల జాబితా అవకతకవలపై చర్చించేందుకు తనకు సమయం ఇవ్వాలని సీఈసీ లేఖ రాశారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూాడా చదవండి..
Delhi Polls 2025: 'ఆప్-దా' నుంచి ఫిబ్రవరి 5న విముక్తి: అమిత్‌షా
Ram Mandir Anniversary: రాముడు ఉంటే దేశం ఉంది, దేశం ఉంటే రాముడు ఉన్నాడు: యోగి
Chennai: ముఖ్యమంత్రి పేరుతో ‘రీచార్జ్’..
Biscuits: అయ్యప్ప భక్తులకు 5 లక్షల బిస్కెట్లు
Read Latest National News and Telugu News
Updated Date - Jan 11 , 2025 | 09:34 PM