Share News

Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:22 PM

మహా కుంభమేళా చివరిదశకు వచ్చిన నేపథ్యంలో భక్తుల తాకిడి మరింత పెరిగింది. దీనికి తోడు మహాశివరాత్రి పండుగ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ మేళాకు ఎంతమంది వచ్చి పుణ్య స్నానాలు చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..
Maha Kumbh Mela rush

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా (Maha Kumbh Mela) చివరిదశకు వచ్చేసింది. ఈరోజు (ఫిబ్రవరి 25) కూడా 44వ రోజున భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం కూడా సంగమం వైపు వెళ్లే రహదారులు జనసమూహంతో కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మొత్తం కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు అంటే ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 12 గంటల నాటికి 63.36 కోట్ల మందికిపైగా భక్తులు సంగమంలో స్నానాలు చేశారని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ X వేదికగా ప్రకటించారు.


ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రేపటి నాటికి దాదాపు 65 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేయగా, ప్రస్తుతం ఈరోజు చివరి నాటికే 65 కోట్ల మంది వచ్చేలా ఉన్నారు. చివరిరోజు రేపటి తర్వాత ఈ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో మహాశివరాత్రి కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా కుంభమేళాకు హాజరై ఈ వేడుకను ముగించనున్నారు. రేపు ప్రయాగ్‌రాజ్‌లో మహాశివరాత్రి చివరి అమృతస్నానం కోసం భక్తులు శ్రీరాముని తపస్సు స్థలమైన చిత్రకూట్ నగరానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో చిత్రకూట్ జిల్లా యంత్రాంగం కూడా అన్ని సన్నాహాలు చేసింది.


ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు చిత్రకూట్ గుండా ప్రవహించే పవిత్ర మందాకినీ గంగానదిలో స్నానం చేసి, ఆపై ఆలయంలో స్వామిని సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు లోతైన నీటిలోకి వెళ్లకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. దీంతో పాటు పలువురు భక్తులు మందాకినీ నదిలో పడవ ప్రయాణం కూడా ఆస్వాదిస్తున్నారు. ఇక మహా కుంభమేళా తర్వాత ఒకేసారి 15 వేల మంది పారిశుధ్య కార్మికులు శుభ్రత డ్రైవ్‌లో పాల్గొననున్నారు. ఇది సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టిస్తుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఈ రికార్డు ఫలితాలను ఫిబ్రవరి 27న ప్రకటించనున్నారు.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 25 , 2025 | 03:23 PM