Share News

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

ABN , Publish Date - Jan 28 , 2025 | 09:30 PM

కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని ఈసీ పేర్కొంటూ ఇందుకు ఆధారాలు ఉన్నాయా అని ఆయనను ప్రశ్నించింది. జాతీయ భద్రతకు, ప్రజాసామరస్యానికి భంగం కలిగించే ఆకతాయి స్టేట్‌మెంట్లు విషయంలో మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తూ తీర్పులు వెలువడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసింది.

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

న్యూఢిల్లీ: హర్యానాలోని అధికార బీజేపీ యమునా నదలోకి కావాలనే పారిశ్రామిక వ్యర్థాలను వదులుతోందని, నదిలో విషం కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తోందని 'ఆప్' కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నారు. ఆ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఎన్నికల కమిషన్ (EC) కేజ్రీవాల్‌కు మంగళవారంనాడు లేఖ రాసింది. 'యుమునా పాయిజనింగ్' వ్యాఖ్యలపై ఆధారాలివ్వాలని కేజ్రీవాల్‌ను ఈసీ కోరింది.

Delhi Elections: వచ్చింది చిన్న కారులో, నివసించింది ప్యాలెస్‌లో.. కేజ్రీపై రాహుల్ పంచ్‌లు


కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని ఈసీ పేర్కొంటూ ఇందుకు ఆధారాలు ఉన్నాయా అని ఆయనను ప్రశ్నించింది. జాతీయ భద్రతకు, ప్రజాసామరస్యానికి భంగం కలిగించే ఆకతాయి స్టేట్‌మెంట్లు విషయంలో మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తూ తీర్పులు వెలువడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసింది. ఇలాంటి ఆరోపణలు ప్రాంతీయ గ్రూపుల మధ్య, ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య శత్రుత్వానికి దారితీస్తాయని, శాంతిభద్రతల పరిస్థితి తలెత్తుతుందని పేర్కొంది. తమకు అందిన ఫిర్యాదులపై జనవరి 29వ తేదీ రాత్రి 8 గంటల్లోగా ఆధారాలతో కూడిన సమాధానం తమకు అందజేయాలని కేజ్రీవాల్‌ను ఈసీ ఆదేశించింది. తద్వారా వాటిని పరిశీలించి ఈసీ తగిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని తెలిపింది.


కాగా, కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై హర్యానా ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికల్లో ఆప్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ అన్నారు. హర్యానా ప్రభుత్వం కేజ్రీవాల్‌పై దావా వేస్తుందని బీజపీ వర్గాలు తెలిపాయి.


ఇవి కూడా చదవండి..

Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..

Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 28 , 2025 | 09:30 PM