Share News

Govt schemes For Farmers: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:18 PM

Govt schemes For Farmers: వివిధ వర్గాల వారికి మోదీ ప్రభుత్వం రకరకాల స్కీమ్స్ తీసుకు వస్తుంది. ఆ క్రమంలో రైతుల కోసం పలు స్కీమ్‌లు అమలు చేస్తోంది. ఈ పథకాలను వినియోగించడం వల్ల రైతులు ఆర్థికంగా లబ్ది పొందుతారు.

Govt schemes For Farmers: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

దేశ ప్రజల కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకు వచ్చింది. విద్యార్థులు, మహిళలే కాకుండా.. వ్యాపారస్థులతోపాటు రైతుల కోసం పలు పథకాలను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా రైతులు పలు ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ పథకాల వల్ల వ్యవసాయ రంగం పురోగతి సాధించడమే కాకుండా.. రైతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి వెన్నుదన్నుగా ఉంటుంది. అందులోభాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సాయాన్ని కేంద్రం అందిస్తోంది.

Farmers-01.jpg

ఈ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో కేంద్రం నగదు జమ చేస్తోంది. అలాగే పంటల నష్ట పరిహారం కోసం పీఎం ఫసల్ బీమా యోజనను సైతం అందిస్తోంది. వీటితో పాటు నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ స్కీమ్, సీడ్ విలేజ్ స్కీమ్, ప్రధాన మంత్రి క్రిషి సంచాయ్ యోజన, పీఎం కుసుమ్ స్కీమ్, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, అగ్రికల్చర్ ఇన్‌ప్రా ఫండ్ స్కీమ్ తదితర పథకాలను రైతులకు ప్రభుత్వం అందిస్తోంది.


farmers03.jpg

పీఎం ఫసల్ బీమా యోజన:

ఈ పథకం ద్వారా రైతులకు నష్టం వచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ముఖ్యంగా రైతులు... పలు విపత్తులు ఎదుర్కొంటారు. అందులోభాగంగా పంటకు తెగుళ్లు సోకడం లేకుంటే.. కరువు సంభవించడం జరుగుతోంది. దీంతో రైతుల పంటలు దెబ్బతింటాయి. అలాంటి వేళ.. పీఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులకు కేంద్రం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు


farmers 04.jpg

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన:

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతుల పెట్టుబడి కోసం ప్రతి ఏడాది రూ. 6 వేలు.. అది కూడా రూ. 2 వేలు చొప్పున మూడు విడతలగా వారికి అందిస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ పథకంలో భాగంగా రూ. 11 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయంగా అందిస్తోంది. ఈ పథకం వల్ల కోట్లాది మంది రైతులకు లబ్ది చేకూరుతోంది.


farmers-06.jpg

కిసాన్ క్రెడిట్ కార్డ్:

దేశానికి రైతే వెన్నుముక. అయితే చాలా సందర్భాల్లో వారి వద్ద పంటకు పెట్టుబడి పెట్టేందుకు చేతిలో సరిపడా నగదు ఉండదు. ఆ సమయంలో వారికి సహాయం సైతం అందదు. అలాంటి వేళ.. రైతులకు ఎటువంటి హామీ లేకుండా రుణాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం.. 1998లో కిసాన్ క్రెడిట్ కార్డులను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది.


అయితే ఈ పథకం ద్వారా కేవలం రుణాన్ని అందించడం మాత్రమే కాకుండా రైతుల తీసుకున్న వడ్డీలో నాలుగు శాతం రాయితీని సైతం అందిస్తుంది. ఇటువంటి పథకాల వలన రైతుల పెట్టుబడి, రుణాలను తిరిగి చెల్లించడానికి ఎంతో ఉపయోగపడుతోంది.

For National News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 04:21 PM