School Closure: జనవరి 18 వరకు స్కూల్స్ బంద్.. కారణమిదే..
ABN, Publish Date - Jan 12 , 2025 | 09:35 PM
పెరుగుతున్న చలి కారణంగా ఒకటి నుంచి 8వ తరగతి పిల్లల పాఠశాలలను జనవరి 18 వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అయితే ఈ స్కూల్స్ ఎక్కడ బంద్ ఉంటాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత (Cold Weather) భారీగా పెరిగింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్(uttar pradesh)లో చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువైంది. దీంతో ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్ జిల్లాలో 8వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలకు జనవరి 18 వరకు సెలవులు (School Closure) ప్రకటించారు. చలి బారి నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ ఇంద్ర విక్రమ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ మొత్తం పాఠశాల సిబ్బంది మాత్రం పాఠశాలలోనే ఉంటారు. ఉద్యోగులందరూ వారి కార్యాలయాలు, విభాగాలకు సంబంధించిన వారి బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆదేశాలలో స్పష్టం చేశారు.
గతంలోని ఉత్తర్వులు ఇప్పుడు..
ఘజియాబాద్ జిల్లాలో చలికాలం కారణంగా 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న అన్ని బోర్డు అనుబంధ పాఠశాలలను జనవరి 18 వరకు మూసివేయాలని జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారి ఆదేశించారు. అన్ని పాఠశాలలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఆదేశాలు పాటించకుంటే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. 8వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలను జనవరి 11వ తేదీ వరకు మూసివేయాలని జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఆ ఉత్తర్వులను పొడిగించారు.
పెరుగుతున్న చలి భయం
ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లను పరిధిలోని వాయువ్య భారతదేశంలో రాబోయే 2-3 రోజుల్లో చాలా దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీంతో పాటు ఒక మోస్తరు పొగమంచు ఉంటుందని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. చలి పెరుగుతుందని డిపార్ట్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్డర్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుంది. CBSE, ICSE, నిధులు లేని, ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు కూడా ఈ ఆర్డర్ పరిధిలోకి వస్తాయి.
నోయిడా పాఠశాలలకు కూడా
దీంతోపాటు నోయిడాలో కూడా 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మూసివేయబడతాయని అధికారులు ప్రకటించారు. లక్నో పాఠశాలలు కూడా జనవరి 14, 2025 వరకు మూసివేయబడతాయి. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో సెషన్లు నిర్వహించనున్నారు. ఆగ్రా, మథురలలో 1 నుండి 8 తరగతుల పాఠశాలలు జనవరి 14, 2025 వరకు మూసివేయబడతాయని అనౌన్స్ చేశారు.
ఢిల్లీ స్కూల్స్ కూడా..
మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు జనవరి 1 నుంచి జనవరి 15, 2025 వరకు శీతాకాల సెలవులను ప్రకటించింది. ఈ ఆర్డర్ ప్రకారం తరగతులు మళ్లీ జనవరి 16, 2025న పునఃప్రారంభించబడతాయి.
ఇవి కూడా చదవండి:
No Helmet No Fuel: నో హెల్మెట్, నో ఫ్యూయల్.. ఈ రాష్ట్రంలో కొత్త విధానం
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీ ఎప్పుడంటే..
Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...
Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News
Updated Date - Jan 12 , 2025 | 09:36 PM