CPM: ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకర్తగా గవర్నర్ ఆర్‌ఎన్ రవి
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:59 PM
రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం తీవ్రంగా విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులతో మూడుసార్లు ‘జై శ్రీరామ్’ అని పలికించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం
చెన్నై: ఆర్‌ఎస్‌ఎస్(RSS) ప్రచారకర్తగా రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(RN Ravi) వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం(Shanmugam) విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో... గవర్నర్ బాధ్యలు చేపట్టినప్పటి నుంచి ఆర్‌ఎన్ రవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన గవర్నర్, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించిన బిల్లులు సైతం ఆమోదించకపోవడం ఖండించదగ్గదన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP: అధికారం చేపట్టే స్థాయికి పార్టీని తీసుకెళతా..
సుప్రీంకోర్టు అక్షింతలతోనైనా గవర్నర్ తీరు మారలేదన్నారు. ఇటీవల మదురై త్యాగరాజర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రసంగించిన గవర్నర్, ప్రసంగం చివరిలో విద్యార్థులతో మూడుసార్లు ‘జై శ్రీరామ్’ అని పలికించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటున్న గవర్నర్... ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని, ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలని షణ్ముగం డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!
తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు
Read Latest Telangana News and National News