Share News

Akilesh Yadav: ట్రంప్‌ను చూసి భారత్ నేర్చుకోవాలి: అఖిలేష్

ABN , Publish Date - Apr 05 , 2025 | 09:43 PM

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉచిత రేషన్ అందుకుంటున్న వారి తలసరి ఆదాయం ఎంతో ఉందో తెలుసుకుంటే అది అర్థమవుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.

Akilesh Yadav: ట్రంప్‌ను చూసి భారత్ నేర్చుకోవాలి: అఖిలేష్

లక్నో: భారతదేశ అర్థిక వ్యవస్థను కాపాడేందుకు అన్ని దేశాలపై మనం కూడా సుంకాలు విధించాలని సమజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చూసి మోదీ ప్రభుత్వం నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు తమ దేశ ఆర్థికవ్యవస్థను కాపాడుకునేందుకు ఇతర దేశాలపై ఆంక్షలు విధిస్తున్నారని, మోదీ ప్రభుత్వం దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలని అన్నారు.

Rahul Gandhi: కాథలిక్ సంస్థలే ఆర్ఎస్ఎస్ తదుపరి టార్గెట్.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు


స్వదేశీ మార్కెట్‌ను, ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు మనం కూడా చైనాపై ఆంక్షలు (సుంకాలు) విధించాలా, వద్దా? అని అఖిలేష్ ప్రశ్నించారు. మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే కచ్చితంగా ఇతర దేశాలపై సుంకాలు విధించాలని అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉచిత రేషన్ అందుకుంటున్న వారి తలసరి ఆదాయం ఎంతో ఉందో తెలుసుకుంటే అది అర్థమవుతుందని అన్నారు. మన ఆర్థిక పరిస్థితిపై తప్పుడు లెక్కలు చూపెడుతున్నారని ఆరోపించారు.


వక్ఫ్ ప్రాపర్టీలపై..

వక్ఫ్ ఆస్తులపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. బీజేపీ ఒక ల్యాండ్ మాఫియా పార్టీ అని, గోరఖ్‌పూర్, అయోధ్యలో వక్ఫ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, గత జనవరిలో మహాకుంభ్ తొక్కిసలాటలో మరణించిన వారి లెక్కలు చెప్పలేదని, నష్టపరిహారం ఇచ్చిన వారి సంఖ్యను బట్టి వాస్తవంగా చనిపోయిన వారి లెక్కను సరిపోల్చలేమని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, న్యాయం జరగడంలేదని, బీజేపీ నేతలే తమకు న్యాయం జరగడం లేదంటూ సొంత పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Amit Shah: ఆయుధాలు వీడండి.. మావోయిస్టులకు అమిత్‌షా పిలుపు

Cash Row: అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ వర్మ

Chennai: రేపు ప్రధాని మోదీతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ భేటీ

Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం

For National News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 09:46 PM