Share News

Nitish Kumar: లాలూ నావల్లే ఎదిగారు.. తేజస్విపై విరుచుకుపడిన నితీష్

ABN , Publish Date - Mar 04 , 2025 | 08:22 PM

నితీష్ కుమార్ ప్రసంగిస్తుండగా తేజస్వి అడ్డుపడటంతో ఆయన ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తన వల్లే లాలూ ప్రసాద్ రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగారంటూ నితీష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Nitish Kumar: లాలూ నావల్లే ఎదిగారు.. తేజస్విపై విరుచుకుపడిన నితీష్

పాట్నా: బీహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar), ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) మధ్య మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. నితీష్ కుమార్ ప్రసంగిస్తుండగా తేజస్వి అడ్డుపడటంతో ఆయన ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తన వల్లే లాలూ ప్రసాద్ రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగారంటూ నితీష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Yogi Adityanath: నేరాలు నిల్, జనం ఫుల్.. మహాకుంభ్ రికార్డిది


"బీహార్‌లో ఇంతకుముందు ఏముంది? మీ తండ్రిని తయారు చేసింది నేను. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనను ప్రోత్సహించిందే నేను. సొంత కులానికి చెందిన వారే ఆయనను (లాలూ) వ్యతిరేకించేవారు. ఆయనను ఎందుకు సపోర్ట్‌గా నిలుస్తున్నారని నన్ను ప్రశ్నించేవారు. అయినప్పటికీ నేను ఆయనకు మద్దతిచ్చా'' అని నితీష్ కుమార్ చెప్పారు.


దీనికి మందు అసెంబ్లీలో తేజస్వి మాట్లాడుతూ, లాలూ ప్రసాద్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, ఇప్పుడంతా లెక్కగా గారడీనేనని అన్నారు. ఆదాయం లేకున్నా బడ్జెట్ పెరుగుతూపోతోందన్నారు. ఈ క్రమంలో ఎన్డీయే ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి నితీష్ మంగళవారంనాడు అసెంబ్లీలో మాట్లాడుతుండగా తేజస్వి ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో నితీష్ ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. బీహార్‌లో గతంలో (లాలూ హయాంలో) పరిస్థితి ఎలా ఉండేదో నీకు తెలియదని, అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడి వని అన్నారు. ప్రజలను అడిగితే తెలుస్తుందని, అప్పట్లో సాయంత్రం అయితే ఎవరూ బయటకు వెచ్చేవారు కాదని అన్నారు. మీ తండ్రి (లాలూ) రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన సొంత మనుషులే వ్యతిరేకిస్తున్నా తాను మద్దతుగా నిలబడ్డానని వివరించారు. బీహార్ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతుండగా, ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ

Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు

Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..

Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2025 | 08:23 PM