Insta Queen: పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఇన్ స్టా క్వీన్..
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:40 PM
Insta Queen: పోలీస్ శాఖలో సీనియర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అమన్‌దీప్ కౌర్‌ను విధుల నుంచి తొలగించారు. పోలీసు దుస్తులు ధరించి ఆమె చేసే రీల్స్.. నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆమెను పోలీస్ కౌర్ దీప్ అంటూ నెటిజన్లు ముద్దుగా పిలుచుకొంటారు.

ఛండీగఢ్, ఏప్రిల్ 04: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో ఫేమస్ అయిన పంజాబ్ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్ హెరాయిన్‌తో పట్టుబడడంతో.. ఆమెను పోలీస్ ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. ఇటీవల బాటిండాలోని బాదల్ ఫ్లై ఓవర్ వద్ద యాంటీ నార్కోటిక్స్ టాక్స్ పోర్స్ (ఏఎన్‌టీఎఫ్)తో కలిసి పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె ప్రయాణిస్తున్న కారులో వీరు సోదాలు చేపట్టారు. ఆ క్రమంలో 17.71 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక డీఎస్పీ హర్బన్ సింగ్ శుక్రవారం వెల్లడించారు. అనంతరం ఆమెను మనస్ పోలీసులకు అప్పగించామని చెప్పారు. దీంతో ఆమెను అరెస్ట్ చేశారన్నారు. ఆమెపై నార్కోటిక్ డ్రగ్స్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇన్ స్టా క్వీన్..
మరోవైపు పోలీస్ శాఖలో సీనియర్ కానిస్టేబుల్‌గా అమన్‌దీప్ కౌర్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె రీల్స్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి వైరల్ అయినాయి. దీంతో ఆమెను.. పోలీస్ కౌర్‌దీప్ అంటూ నెటిజన్లు పిలుచుకొంటున్నారు. ఆమె పోస్ట్ చేసిన రీల్స్ అన్ని దాదాపుగా ఖాకీ దుస్తులు ధరించి చేసినవే కావడం గమనార్హం.
డీజీపీ ఇప్పటికే ఆదేశం..
ఇక యూనిఫాంలో మోడలింగ్ చేస్తున్నట్లు చూపించే కంటెంట్‌ను ఆమె పోస్ట్ చేయకుండా చూడాలంటూ ఇప్పటికే డీజీపీ నుంచి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.
ఫాలోవర్లు వేలల్లో..
ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఆమెకు 37 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు సిద్దూ మూసేవాల ఇటీవల హత్య గావింపబడ్డారు. అతడికి న్యాయం చేయాలంటూ సిద్దూ ఆలపించిన పాటలున్న వీడియోను అమన్‌దీప్ కౌర్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పలు ఆరోపణలు.. వివాదాలు..
అమన్‌దీప్ కౌర్‌ను పలు ఆరోపణలు చట్టుముట్టాయి. పోలీస్ శాఖలో సాధారణ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అమన్‌దీప్ కౌర్ ఆడంబర జీవన శైలిని గుర్మీత్ కౌర్ అనే మహిళ బహిరంగంగా ప్రశ్నించింది.
ఆమెకు రూ. 2 కోట్లు విలువైన ఇల్లు, రెండు కార్లు, లక్షల రూపాయిలు విలువ చేసే గడియారం ఉన్నాయని ఆమె ఆరోపించింది. అలాగే పలు వివాదాల్లో సైతం అమన్‌దీప్ కౌర్ చిక్కుకున్నట్లు ఓ చర్చ అయితే సాగుతోంది. అంబులెన్స్ డ్రైవర్‌తో అమన్ దీప్ కౌర్ సహజీవనం చేస్తుందంటూ స్వయంగా ఆమె భర్త ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇక అమన్‌దీప్ కౌర్, అంబులెన్స్ డ్రైవర్‌తో కలసి హెరాయిన్ విక్రయిస్తున్నారని సదరు మహిళ గుర్మీత్ కౌర్ ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన .. వారు ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పెదవి విరిచారు. ఇంకోవైపు.. కౌర్‌కు డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్లీజ్.. అన్నామలైని మార్చొద్దు
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News