Jaipur Bomb Blast Case: జైపూర్ బాంబు పేలుళ్ల కేసు: దోషులకు జీవిత ఖైదు
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:39 PM
Jaipur Bomb Blast Case: 2008లో జైపూర్‌లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ కేసులో జైపూర్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ పేలుళ్లతో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది.

జైపూర్, ఏప్రిల్ 08: 2008 జైపూర్ నగరంలో వరుస బాంబు పేలుళ్ల కేసులో కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురు నిందితులు.. షాబాజ్ హుస్సేన్, సర్వర్ అజ్మీ, మహమ్మద్ సైఫ్‌తోపాటు సైఫ్ ఉర్ రెహ్మాన్‌కు జైపూర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో 112 సాక్ష్మాలను కోర్టు పరిగణలోకి తీసుకొంది.
2008, మే 13వ తేదీన జైపూర్ నగరంలోని ఎనిమిది ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. తొమ్మిదోవ ప్రదేశంలో బాంబు పేలుడు సంభవించే క్రమంలో.. కొద్ది నిమిషాల ముందు భద్రతా సిబ్బంది దానిని గుర్తించారు. అనంతరం ఆ బాంబును నిర్వీర్యం చేశారు. ఈ బాంబు పేలుళ్లలో 71 మంది మరణించగా.. 185 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కేసులో సర్వార్ అజ్మీ, మహ్మద్ సైఫ్, సైఫ్ ఉర్ రెహ్మాన్‌తోపాటు షాబాజ్‌లను దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారికి ఈ రోజు జీవిత ఖైదు విధించింది.
అయితే 2019, డిసెంబర్‌లో ఈ బాంబు పేలుళ్ల కేసులో దిగువ కోర్టు.. ఈ నలుగురికి మరణశిక్ష విధించింది. అదే సమయంలో ఐదో నిందితుడు షాబాజ్‌ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. ఇక మరణ శిక్ష పడిన ఈ నలుగురు దోషులు దిగువ కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాల్ చేసిన విషయం విధితమే. మరోవైపు.. తెలంగాణలోని హైదరాబాద్‌లో దిల్‌షుఖ్‌నగర్ జంట బాబు పేలుళ్ల కేసులో సైతం హైకోర్టు కీలక తీర్పు ఇదే రోజు వెలువరించింది. ఈ కేసులో నలుగురు నిందితులకు కింద కోర్టు ఉరి శిక్షను ఖరారు చేసింది. ఈ శిక్షను తెలంగాణ హైకోర్టు సైతం సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ రెండు బాంబు కేసుల్లో తీర్పులు ఒకే రోజు వెలువడడం గమనార్హం.
For National News And Telugu News