West Bengal: డాక్టర్లు, వైద్య సిబ్బందికి భారీగా వేతనాల పెంపు
ABN , Publish Date - Feb 24 , 2025 | 08:37 PM
కొత్త పే-స్ట్రక్చర్ ప్రకారం ప్రస్తుతం రూ.65,000 వేతనం పొందుతున్న డిప్లొమో హోల్డింగ్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఇకనుంచి రూ.80,000 వేతనంగా పొందుతారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల వేతనం రూ.70,000 నుంచి రూ.85,000కు పెరిగింది.

కోల్‌కతా: రాష్ట్రంలోని వైద్యులు, వైద్య సిబ్బందికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) శుభవార్త చెప్పారు. వారి వేతనాలను గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన ఇటీవల రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన క్రమంలో మమతా బెనర్జీ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Delhi Assembly: అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోల రగడ.. ఢిల్లీ అసెంబ్లీలో తొలిరోజే హైడ్రామా
ధోనో ధన్యో ఆడిటోరియంలో సీనియర్, జూనియర్ వైద్యులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లతో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, అన్ని స్థాయిల్లోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల వేతనాలను రూ.15,000 పెంచుతున్నామని చెప్పారు. కొత్త పే-స్ట్రక్చర్ ప్రకారం ప్రస్తుతం రూ.65,000 వేతనం పొందుతున్న డిప్లొమో హోల్డింగ్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఇకనుంచి రూ.80,000 వేతనంగా పొందుతారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల వేతనం రూ.70,000 నుంచి రూ.85,000కు పెరిగింది. పోస్ట్-డాక్టొరల్ సీనియర్ డాక్టర్ల వేతనం రూ.75,000 నుంచి రూ.1 లక్షకు పెరిగింది.
ఇంటెర్న్‌లు, హౌస్ స్టాప్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, పోస్‌డాక్టొరల్ ట్రైనీలు అందరికీ రూ.10,000 ఇంక్రిమెంట్ పెంచుతున్నట్టు కూడా మమతా బెనర్జీ ప్రకటించారు. గతంలోనూ సీనియర్, జూనియర్ రెసిడెన్స్ డాక్టర్లకు వేతనాలు పెంచామని, ఇప్పుడు మరోసారి వేతనాల రివిజన్ చేపట్టామని చెప్పారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో వైద్య వృత్తిలో ఉన్న వారు ఆర్థికంగా మరింత బలపడతారని అన్నారు.
ఆ ఘటన దురదృష్టకరం
గత ఏడాది ఆగస్టులో జరిగిన ఆర్జే కర్ మెడికల్ కాలేజీ ఘటన దురదృష్టకరమని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలిని తన సోదరిగా పేర్కొంటూ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు్న్నానని అన్నారు. ఇలాంటి హేయమైన నేరాలు పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించే 'అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్'ను 2024లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఆమోదించామని, ఆ బిల్లు ఇప్పటికీ రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురతెన్నులు చూస్తోందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.