Share News

Mohan Bhagwat: దేశంలో బాధ్యతాయుతమైన సమాజం హిందూ సమాజమే

ABN , Publish Date - Feb 16 , 2025 | 02:54 PM

దేశాన్ని పాలించిన సామ్రాట్టులు, మహారాజులను గుర్తుపెట్టుకోరని, తండ్రి మాట నిలబెట్టేందుకు 14 ఏళ్లు ఆజ్ఞాతవాసం అరణ్యవాసం చేసిన రాజును, తన సోదరుడి పాదరక్షలు తీసుకుని అతని తిరిగి రాగానే రాజ్యాన్ని అప్పగించిన వ్యక్తిని గుర్తుంచుకుంటుందని మోహన్ భాగవత్ అన్నారు.

Mohan Bhagwat: దేశంలో బాధ్యతాయుతమైన సమాజం హిందూ సమాజమే

న్యూఢిల్లీ: ఇండియాకు వారసులు హిందువులని, భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందూ సమాజం విశ్వసిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) అన్నారు. పశ్చిమబెంగాల్‌లోని బర్ధమాన్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో ఆదివారంనాడు జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, మనం కేవలం హిందూ సమాజం పైనే ఎందుకు దృష్టి పెడతామని ప్రజలు తరచు అడుగుతుంటారని, దీనికి సమాధానంగా దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదైనా ఉందంటే అది హిందూ సమాజమేనని తాను చెబుతుంటానని అన్నారు.

Stampede Incident.. రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..


''ఇండియాకు సహజ స్వభావం ఉంది. ఆ లక్షణాలతో ఇమడలేమని అనుకున్న సమాజంలోని ఒక వర్గం ప్రత్యేక దేశంగా విడిపోయింది. ప్రపంచంలోని భిన్నత్వాన్ని ఆమోదిస్తూ హిందువులు జీవనం సాగిస్తుంటారు. భిన్నత్వమే ఐక్యతగా హిందువులు గ్రహించారు'' అని అన్నారు.


చరిత్ర వారిని గుర్తుంచుకోదు..

దేశాన్ని పాలించిన సామ్రాట్టులు, మహారాజులను గుర్తుపెట్టుకోరని, తండ్రి మాట నిలబెట్టేందుకు 14 ఏళ్లు అరణ్యవాసం చేసిన రాజును, తన సోదరుడి పాదరక్షలు తీసుకుని అతను తిరిగి రాగానే రాజ్యాన్ని అప్పగించిన వ్యక్తిని గుర్తుంచుకుంటుందని అన్నారు. పది రోజుల పర్యటన కోసం మోహన్ భాగవత్ పశ్చిమబెంగాల్ వచ్చారు. వివిధ నగరాల్లో సంఘ్ ఏర్పాటు చేస్తున్న మేథోమథన సదస్సుల్లో ఆయన పాల్గొంటున్నారు.


ఇవి కూడా చదవండి...

Maharashtra: మహారాష్ట్రలో లవ్‌ జిహాద్‌ నియంత్రణకు చట్టం!

Ranveer Allahbadia: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా పోస్ట్‌లో రణ్‌వీర్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2025 | 02:55 PM