Share News

PM Modi: బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి

ABN , Publish Date - Jan 05 , 2025 | 02:47 PM

గత పదేళ్లలో 'విపత్తు' (AAP-DA)నే చూశామని, అభివృద్ధేనే ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల కోసం బీజేపీ పనిచేస్తుందని నమ్మకం ప్రజలకు ఉందని నరేంద్ర మోదీ అన్నారు.

PM Modi: బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి

న్యూఢిల్లీ: ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీ (BJP)కి ఒక్క అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కోరారు. దేశ రాజధానిని అభివృద్ధి చేయగలిగే పార్టీ ఒక్క బీజేపీయేనని అన్నారు. రోహిణిలో ఆదివారంనాడు జరిగిన 'బీజేపీ పరివర్తన యాత్ర' (BJP Parivartan Yatra) లో ఆయన మాట్లాడుతూ, మనం 2025 సంవత్సరంలో ఉన్నామని, 21వ శతాబ్దంలో 25 ఏళ్లు గడిచిపోయాయని, శతాబ్దంలో పావు సంవత్సరం ముసిగిపోయిందని అన్నారు. ఈ 25 ఏళ్లలో రెండు, మూడు తరాల యువతరం ఢిల్లీలో ఎదిగిందని, రాబోయే 25 ఏళ్లు భారతదేశ భవిష్యత్తుకు, ఢిల్లీ భవిష్యత్తుకు చాలా కీలకమని చెప్పారు. ఈ పాతికేళ్లలో దేశం 'వికసిత్ భారత్'గా రూపొందనుందని అన్నారు.

Delhi-Meerut: నమో భారత్ కారిడార్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ.. తర్వాత పిల్లలతో


''ఢిల్లీలో ఈరోజు వేల కోట్లు విలువచేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. రాబోయే 25 ఏళ్లు, దేశానికి, ఢిల్లీకి చాలా కీలకం. వికసత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తు్న్నాం'' అని ప్రధాని చెప్పారు. ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, ఢిల్లీని బీజేపీ అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్తుందని భరోసా ఇచ్చారు. గత పదేళ్లలో 'విపత్తు' (AAP-DA)నే చూశామని, అభివృద్ధేనే ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల కోసం బీజేపీ పనిచేస్తుందని నమ్మకం ప్రజలకు ఉందని అన్నారు. ప్రజావిశ్వాసం చూరగొనడం వల్లే హర్యానా, ఒడిశా, మహారాష్ట్ర వంటి పలు ఎన్నికల్లో పార్టీ గెలుపొందిందని, ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తుందనే గట్టి నమ్మకం ఉందన్నారు.


ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా..

ఢిల్లీకి ప్రపంచంలోనే ఉత్తమ నగర హోదాను తీసుకురాగలిగే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని మోదీ అన్నారు. 'ఆప్‌దా'ను ఢిల్లీ నుంచి తొలగించి ఢిల్లీ ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు ఇదే తగిన సమయమని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: ఈ జాతర కోసం 13,000 రైళ్లు.. ఈసారి 40 కోట్ల మంది వస్తారని..

Chatthisghar: నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఎంతమంది మావోలు మృతంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 05 , 2025 | 02:51 PM