Share News

RBI: ఆర్బీఐ కొత్త గవర్నర్‌ సంతకంతో రూ.50 నోట్లు!

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:37 AM

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) కొత్త గవర్నర్‌ సంతకంతో కూడిన రూ.50 నోట్లు త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్‌ మల్హోత్రా సంతకం చేసిన రూ.50 నోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ బుధవారం వెల్లడించింది.

RBI: ఆర్బీఐ కొత్త గవర్నర్‌ సంతకంతో రూ.50 నోట్లు!
50 Rupees Notes

  • త్వరలోనే మార్కెట్‌లోకి.. పాత నోట్లు యథావిధిగా

  • చెల్లుబాటు అవుతాయి: ఆర్బీఐ

  • ‘కోటక్‌ మహీంద్రా’పై ఆంక్షల ఎత్తివేత.. కొత్త క్రెడిట్‌ కార్డులు ఇచ్చేందుకూ ఆర్బీఐ అనుమతి

ముంబై, ఫిబ్రవరి 12: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) కొత్త గవర్నర్‌ సంతకంతో కూడిన రూ.50 నోట్లు త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్‌ మల్హోత్రా సంతకం చేసిన రూ.50 నోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ బుధవారం వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్లోఉన్న రూ.50 నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఆర్బీఐ గవర్నర్‌ మల్హోత్రా సంతకంతో నోట్లు జారీ కావడం ఇదే తొలిసారి. గత ఏడాది డిసెంబరులో ఆయన ఆర్‌బీఐ పగ్గాలు చేపట్టారు. మహాత్మాగాంధీ సిరీ్‌సలో కొత్త గవర్నర్‌ సంతకంతో రూ.50 నోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.


ప్రస్తుతం చాలా వరకు పాత గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకం చేసిన నోట్లే చలామణీలో ఉన్నాయి. మరోవైపు, ప్రైవేట్‌ రంగానికి చెందిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు భారీ ఊరట లభించింది. 9 నెలల క్రితం (2024 ఏప్రిల్‌) ఈ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ బుధవారం ప్రకటించింది. గతంలో గుర్తించిన లోపాలపై బ్యాంక్‌ తగిన చర్యలు చేపట్టిన నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కోటక్‌ బ్యాంక్‌ మళ్లీ ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ చానళ్ల ద్వారా కొత్త వినియోగదారులను చేర్చుకునేందుకు వీలు కలగనుంది. అలాగే, కొత్త క్రెడిట్‌ కార్డులు జారీ చేసేందుకూ ఈ బ్యాంక్‌కు అనుమతిచ్చింది.

Updated Date - Feb 13 , 2025 | 07:18 AM