AAP Documentary: ఆప్ డాక్యుమెంటరీ 'అన్‌బ్రేకబుల్'కి బ్రేక్
ABN , Publish Date - Jan 18 , 2025 | 03:00 PM
ఎన్నికల నిబంధన ప్రకారం పార్టీలు ఇలాంటి (డాక్యుమెంటరీ ప్రదర్శన) ఈవెంట్లు నిర్వహించాలనుకుంటే జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) కార్యాలయంలోని సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని, సందర్భాన్ని బట్టి పోలీసులు అనుమతి ఇవ్వడం కానీ నిరాకరించడం కానీ జరుగుతుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

న్యూఢిల్లీ: కొద్దికాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతల అరెస్టుల వెనుక రహస్యాలను బహిర్గతం చేస్తూ ఆ పార్టీ రూపొందించిన 'అన్‌బ్రేకబుల్' (Unbreakable) డాక్యుమెంటరీ ప్రదర్శనకు ఆదిలోనే గండిపడింది. ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌కు తమ అనుమతి తీసుకులేదని ఢిల్లీ పోలీసులు అభ్యంతరం తెలిపారు. డాక్యుమెంటరీ ప్రదర్శన జరిపితే అది ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తేల్చిచెప్పారు.
RG Kar Rape Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి అతడే.. శిక్ష ఎప్పుడంటే..?
ఎన్నికల నిబంధన ప్రకారం పార్టీలు ఇలాంటి (డాక్యుమెంటరీ ప్రదర్శన) ఈవెంట్లు నిర్వహించాలనుకుంటే జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) కార్యాలయంలోని సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని, సందర్భాన్ని బట్టి పోలీసులు అనుమతి ఇవ్వడం కానీ నిరాకరించడం కానీ జరుగుతుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనావళిని అన్ని పార్టీలు తూ.చ. తప్పకుండా పాటించాలని కోరారు. ''ఆప్ డాక్యుమెంటరీ ఈవెంట్‌కు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇది ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన కిందకు వచ్చింది. ఒకసారి ఎన్నికలంటూ ప్రకటిస్తే వెంటనే ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వస్తుంది. డీఈఏ కార్యాలయంలోని సింగిల్ విండో సిస్టంకు దరఖాస్తు చేసుకోవడమనేది ఎన్నికల్లో స్టాండర్డ్ ప్రాసెస్'' అని వివరించారు.
డాక్యుమెంటరీ బ్యాన్ వెనుక బీజేపీ: ఆప్
ఆప్ డాక్యుమెంటరీ ప్రదర్శనకు అనుమతి తీసుకోలేదంటూ పోలీసులు ప్రకటించడంతో ఆప్ స్పందించింది. అన్‌బ్రేకబుల్ డాక్యుమెంటరీపై నిషేధం బీజేపీ పనేనని ఆరోపించింది. తమ డాక్యుమెంటరీ ప్రదర్శించకుండా ఢిల్లీ వ్యాప్తంగా థియేటర్ల యజమానులను బెదరింపులు వెళ్లాయని ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఆప్ లీడర్లు జైలుకు వెళ్లడంపై తీసిన డాక్యుమెంటరీ షెడ్యుల్ ప్రకారం మధ్యాహ్నం 11.30 గంటలకు థియేటర్లలో ప్రదర్శించాల్సి ఉందని, అయితే థియేటర్ యజమానులను బెదరించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆప్ నేతల అక్రమ అరెస్టులు వెనుక ఉన్న రహస్యాలను డాక్యుమెంటరీ బహిర్గతం చేయనుండటంతో బీజేపీకి వణుకు పుట్టిందని 'ఆప్' చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అనుకున్నామని, బీజేపీ దీనిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించిందన్నారు. బీజేపీ ఎందుకు బయపడుతోందని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Hero Vijay: తేల్చి చెప్పేసిన హీరో విజయ్.. విషయం ఏంటంటే..
Karnataka: కర్ణాటకలో పట్టపగలే బ్యాంకు దోపిడీ
Read Latest National News and Telugu News