Share News

P Chidambaram: తమిళనాడుకు భారీగా పెరిగిన నిధులు.. చిదంబరం విమర్శలు

ABN , Publish Date - Apr 07 , 2025 | 07:18 AM

తమిళనాడుకు కేంద్రం కేటాయింపులపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రాజేశాయి. గతంతో పోలిస్తే.. ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలోనే తమిళనాడుకు భారీగా నిధులు కేటాయించామన్న మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత పీ చిదంబరం కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు..

P Chidambaram: తమిళనాడుకు భారీగా పెరిగిన నిధులు.. చిదంబరం విమర్శలు
Chidambara modi

చెన్నై: తమిళనాడుకు కేంద్రం ప్రభుత్వం అందించిన నిధుల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పాంబన్ వంతెన ప్రారంభం సందర్భంగా తమిళనాడులో పర్యటించిన మోదీ.. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి పోలిస్తే.. ఈ పదేళ్లలో తమిళనాడుకు 3 రెట్లు అధికంగా నిధులిచ్చామన్నారు. అలానే ఈ పదేళ్ల కాలంలో రైల్వే బడ్జెట్‌ను 7రెట్లు పెంచామని.. రామేశ్వరం సహా రాష్ట్రంలో 77 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మోదీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హీట్ పెంచాయి.


మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పందిస్తూ.. తమిళనాడుకు కేంద్రం కేటాయించిన నిధుల గురించి ఫస్ట్ ఇయర్ ఎకనామిక్ విద్యార్థిని అడిగినా చెప్తాడని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులలో వార్షిక పెరుగుదల సాధారణ ప్రక్రియలో భాగమని.. దీని గురించి తెలుసుకోవడం కనీస అవసరం అని.. ఫస్టియర్ ఎకనామిక్ విద్యార్థి కూడా దీని గురించి వివరించగలడంటూ చిదంబంర ఎద్దేవా చేశారు.

తమిళనాడు పర్యనటలో మోదీ ప్రసంగిస్తూ.. రాష్ట్రానిక కేంద్రం నిధులను నిలిపివేసిందన్న డీఎంకే రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టారు. 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే.. ఈ పదేళ్లలో.. రాష్ట్రానికి సంబంధించిన రైల్వేలు, రోడ్డు ప్రాజెక్టులు,కేంద్ర పథకాలకు కేటాయింపులు అనేక రెట్లు పెరిగాయని, తమిళనాడుకు కేటాయింపులు పెరిగినప్పటికీ, కొందరు నిధుల కోసం "ఏడుస్తున్నారు" అంటూ పరోక్షంగా స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు మోదీ.


మోదీ వ్యాఖ్యలపై చిదంబరం స్పందిస్తూ.. వార్షిక కేటాయింపులు సాధారణంగా కాలక్రమేణా పెరుగుతాయని.. అది చాలా సర్వసాధారణమైన అంశం అన్నారు. అయితే కేటాయింపులు అనేవి.. జీడీపీ నిష్పత్తిలో పెరిగాయా లేదా.. మొత్తం ప్రభుత్వ వ్యయంలో పెరిగాయా లేదా అన్నది ముఖ్యమన్నారు చిదంబరం.

గతంతో పోలిస్తే.. ఇప్పుడు జీడీపీ పరిమాణం పెరిగిందని.. అలానే గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ పరిమాణం పెద్దదిగా ఉందని.. అలానే ప్రతి సంవత్సరం ప్రభుత్వ మొత్తం వ్యయం పెరిగిందని చెప్పుకొచ్చారు చిదంబరం. కేటాయింపుల విషయానికి వస్తే.. సంఖ్యల పరంగా చూసుకుంటే.. అది చాలా పెద్దదిగా కనిపిస్తుందని.. కానీ వాస్తవంగా చూసుకుంటే.. జీడీపీ నిష్పత్తి పరంగా, మొత్తం ఖర్చు నిష్పత్తి పరంగా ఎక్కువగా ఉందా లేదా అన్నది పరిగణలోకి వస్తుందని చిదంబరం స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

ఇంకా పరారీలోనే మాజీ మంత్రి కాకాణి

5 నెలలుగా తలనొప్పి.. సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..

Updated Date - Apr 07 , 2025 | 07:18 AM