Share News

PM Modi: పాంబన్ బ్రిడ్జితో శరవేగంగా వాణిజ్యం, పర్యాటకాభివృద్ధి: మోదీ

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:05 PM

అభివృద్ధి భారతం (వికసిత్ భారత్)లో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందని, పంబన్ రైల్వే వంతెనపై కొత్త రైలు సర్వీసుతో రామేశ్వరం, చెన్నై, దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

PM Modi: పాంబన్ బ్రిడ్జితో శరవేగంగా వాణిజ్యం, పర్యాటకాభివృద్ధి: మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెన (Pamban Bridge) దేశవ్యాప్తంగా వాణిజ్యం, ఆర్థిక వృద్ధి పెరగడానికి దోహదపడుతుందని, తమిళనాడులో పర్యటకాభివృద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా కోస్తాతీరం రామేశ్వరంలో రూ.8.300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రధాని ఆదివారంనాడు ప్రారంభించారు.

Pamban Bridge: పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ


''ఇది చాలా ప్రత్యేకమైన రోజు. రూ.8,300 కోట్ల అభివృద్ధి ప్రాజక్టులను ప్రారంభించే అవకాశం నాకు లభించింది. రైలు, రోడ్డు ప్రాజెక్టులతో తమిళనాడుకు మరింత అనుసంధానం పెరుగుతుంది. తమిళనాడు సోదర సోదరీమణులకు ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తు్న్నాను'' అని మోదీ అన్నారు. అభివృద్ధి భారతం (వికసిత్ భారత్)లో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందని, పంబన్ రైల్వే వంతెనపై కొత్త రైలు సర్వీసుతో రామేశ్వరం, చెన్నై, దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుందని చెప్పారు. ఇందువల్ల తమిళనాడులో వాణిజ్యంతో పాటు పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుందని, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తమిళనాడు అభివృద్ధితో దేశ సర్వతోముఖాభివృద్ధి సాకారమవుతుందని, 2014 కంటే ముందుతో పోల్చుకుంటే గత దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు మూడు రెట్లు అధికంగా నిధులు కేటాయించిందని తెలిపారు. ఇందువల్ల పారిశ్రామిక, ఆర్థిక వృద్ధి సాధ్యమైందని చెప్పారు. గత పదేళ్లలో రైల్వే, రోడ్లు, విమానాశ్రయాలు, వాటర్, పోర్ట్‌లు, విద్యుత్, గ్యాస్ పైప్‌లైన్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనను దాదాపు 6 రెట్లు బడ్జెట్‌ పెంచామని తెలిపారు.


వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న రామేశ్వరం పట్టణంలో నిర్మించిన పాంబన్ వంతెన 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రధాని అభివర్ణించారు. ఇందుకోసం అహరం శ్రమించిన ఇంజనీర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తు్న్నానని అన్నారు. ఈ వెర్టికల్ లిఫ్ రైల్వే సీ బ్రిడ్జి దేశంలోనే మొదటిదని, వంతెన కింద నుంచి పెద్దపెద్ద నౌకలు కూడా వెళ్తాయని తెలిపారు. రైళ్లు శరవేగంగా వంతెనపై దూసుకెళ్తాయని, కొత్త రైలు, ఒక నౌకను కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభించానని చెప్పారు. కాగా, మోదీ తన పర్యటనలో భాగంగా రామేశ్వరంలోని ప్రఖ్యాత రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.


ఇవి కూడా చదవండి..

Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది

Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ

For National News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 04:05 PM