PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ
ABN , Publish Date - Apr 15 , 2025 | 07:51 PM
రివర్‌బెడ్‌కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది.

శ్రీనగర్: ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో ప్రాంతీయ అనుసంధానం, పర్యాటకానికి పెద్దపీట వేస్తున్న భారత రైల్వే శాఖ కొత్తగా వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ (Vaishno Devi Katra To Srinagar) వందేభారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తెస్తోంది. జమ్మూకశ్మీర్ పర్యటించే వారికి మరింత విలువైన సేవలను ఈ హైస్పీడ్ రైలు అందించనుంది.
Muda Case: సీఎంకు ఎదురుదెబ్బ.. లోకాయుక్త పోలీసుల విచారణ కొనసాగింపు
రివర్‌బెడ్‌కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది. అంజి ఖాడ్ వంతెన, చినాబ్ వంతెన పూర్తి కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో జమ్మూకశ్మీర్‌కు రైలు సేవల అనుసంధానమవుతున్నాయి.
కాగా, వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ మధ్య తొలిసారి నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న ప్రారంభించనున్నారు. 272 కిలోమీటర్ల ఈ రైల్వే లేన్ ఏర్పాటుతో కేవలం 3 గంటల్లో గమ్యం చేరవచ్చు. ప్రస్తుతం కట్రా-శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణనికి 6 నుంచి 7 గంటలు పడుతోంది. విమానమార్గంలో చేరేందుకు గంట పడుతోంది. ఇప్పడు వందేభారత్ రైలుతో వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
ఇవి కూడా చదవండి..