ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National : 20 ఏళ్ల తర్వాత.. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పీవీ ఫోటో

ABN, Publish Date - Jan 16 , 2025 | 10:46 AM

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించిన 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పీవీ ఫొటో ఏర్పాటు..

PV Narasimha Rao's Legacy Finally Recognized by Congress

బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని, తెలుగువారి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు సేవలకు.. మరణించిన 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యాలయంలో చోటు దక్కింది. సంక్షోభ సమయంలో ప్రధానిగా, గాంధీయేతర కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన చాకచక్యంతో సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చిన పీవీకి.. మరణించిన తర్వాత పార్థివదేహాన్ని ప్రధాన కార్యాలయంలోకి అనుమతించకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పీవీ ఫొటోలను నిషేధించింది. గతేడాది మాజీ ప్రధాని పీవీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీంతో ఉద్దేశపూర్వకంగా పీవీ సేవలను విస్మరించిందనే తీవ్ర విమర్శలు అంతటా వ్యక్తమయ్యాయి.అయితే, ఐదు దశాబ్దాల పాటు ఢిల్లీలోని అక్బర్ రోడ్డు 24వ నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చిన కాంగ్రెస్..తాజాగా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని వేరే చోటుకి మార్చింది. ఆరు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో నూతన పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందించిన ప్రముఖ నాయకుల చారిత్రక విజయాలు, రచనలు, నిర్ణయాలను చిత్రాల ద్వారా కార్యాలయంలో పొందుపర్చింది.


ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో సొంత భవనాలు నిర్మించుకున్నాయి అన్ని పార్టీలు. అందువల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తమ ప్రధాన కార్యాలయాన్ని '24 అక్బర్ రోడ్' నుంచి '9A కోట్లా మార్గ్'కు తరలించింది. కొత్తగా నిర్మించిన కార్యాలయానికి 'ఇందిరా భవన్' అని నామకరణం చేశారు. దీన్ని పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రావు, మన్మోహన్ సింగ్‌ల పాలనలో సాధించిన విజయాలు, సంస్కరణలపై ప్రత్యేక వీడియో ప్రసారం చేశారు.


పార్టీ ప్రధాన కార్యాలయానికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు పెట్టినప్పటికీ, పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన ప్రముఖ నాయకుల విజయాలను ఫొటో గ్యాలరీ రూపంలో కార్యాలయంలో భద్రపరిచింది. దీన్ని బట్టి కొత్త కార్యాలయంలో గాంధీ-నెహ్రూ కుటుంబంతో పాటు ఇతర నాయకుల సహకారానికి గుర్తింపు లభిస్తుందనే సంకేతం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


కాంగ్రెస్ కొత్త కార్యాలయంలో పీవీ ఫొటోలివే..

పీవీ గారు వెదురు కుర్చీపై కూర్చున్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరొక దాంట్లో రాష్ట్రపతి భవన్‌లోకి దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ యంగ్ సామ్‌‌ను అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతో కలిసి స్వాగతిస్తున్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలోనూ కనిపిస్తారు. అదే ఫ్రేమ్‌లో యువకుడిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చూడవచ్చు.

Updated Date - Jan 16 , 2025 | 10:46 AM