Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:00 PM
తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా అరటి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే.. తిరుప్పూరులో కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

- విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి...
చెన్నై: ఈరోడ్ జిల్లాలో రెండురోజులుగా ఉరుములు మెరుపులు, పెనుగాలులతో కురిసిన కుండపోత వర్షానికి అరటితోటలు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో గత వారం రోజులు వేసవిని తలపించేలా ఎండలు ప్రజలను భయాందోళన కలిగించాయి. రెండు రోజుల క్రితం ఓ మోస్లరు వర్షం కురవగా, ఆదివారం సాయంత్రం హఠాత్తుగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులలో కుండపోతగా వర్షం కురిసింది.
ఈ వార్తను కూడా చదవండి: Raind: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 12 వరకు వర్షసూచన
పెనుగాలులకు నంబియూరు, సూరియంపాళయం వద్ద పాఠశాల సమీపంలో ఐదు భారీ వృక్షాలు నేలకూలాయి. పలుచోట్ల పెంకుటిళ్ల పైకప్పులు, గుడిసెలపై తాటాకుల పైకప్పులు ఎగిరిపోయాయి. పెనుగాలులకు ఆర్జీకే పుదూరుకు చెందిన రాసు అనే వ్యక్తి చెందిన తోటలో 500లకు పైగా అరటిచెట్టు, వట్టకాడు గ్రామంలో నిర్మల్‌కుమార్‌కు చెందిన తోటలో 200 , కుమార్ అనే వ్యక్తికి చెందిన 400 అరటి చెట్లు ధ్వంసమయ్యాయి.
విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి...
ఇదిలా ఉండగా తిరుప్పూరులో కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. జిల్లాలోని పల్లడం మహాలక్ష్మినగర్(Mahalakshmi Nagar) సమీపంలో పెనుగాలులకు చెట్లు కూలిపడ్డాయి. కామనాయకన్ పాళయం పోలీసుస్టేషన్ సమీపంలో రెండు కొబ్బరి చెట్లు కూలిపడ్డాయి. పలు చోట్లు విద్యుత్ తీగెలు తెగిపడ్డాయి. ఈ నేపథ్యంలో పల్లడటం వద్ద ఇనోద్ (40) అనే వ్యక్తి రోడ్డుపై తెగిపడి ఉన్న విద్యుత్ తీగపై కాలు వేయడంతో కరెంట్‌షాక్‌కు గురై మృతి చెందాడు. ఇదే విధంగా మరో చోట తెగిపడిన విద్యుత్‌తీగను తొక్కటం వల్ల రాజ్ అనే వ్యక్తి మృతి చెందాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News