Share News

Special Vande Bharat Train: నేటి నుంచి ప్రయాగ్‌రాజ్‌కి ప్రత్యేక వందే భారత్ రైలు..

ABN , Publish Date - Feb 15 , 2025 | 10:53 AM

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు శుభవార్త వచ్చేసింది. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో ఈరోజు నుంచి కుంభమేళాకు ప్రత్యేక వందే భారత్ టైన్స్ ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Special Vande Bharat Train: నేటి నుంచి ప్రయాగ్‌రాజ్‌కి ప్రత్యేక వందే భారత్ రైలు..
Special Vande Bharat Train

మహా కుంభమేళా(maha kumbh mela 2025)కు రైలు ప్రయాణం ద్వారా వెళ్లాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే భక్తుల ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌కి ప్రత్యేక వందే భారత్ రైలును (Special Vande Bharat Train) ప్రకటించింది. ఈ రైలు నేటి (ఫిబ్రవరి 15) నుంచి ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుంది. మహాకుంభ మేళాకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రకటించింది. ఈ రైలు హై స్పీడ్ సర్వీసుతో భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.


తక్కువ సమయంలో

ఈ ప్రత్యేక వందే భారత్ రైలు (రైలు నెం. 02252) న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య నడుస్తుంది. ఈ ట్రైన్ న్యూఢిల్లీ (NDLS) నుంచి ఉదయం 05:30 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 14:20 గంటలకు వారణాసి (BSB) చేరుకుంటుంది. ప్రయాగ్‌రాజ్ చేరుకునే సమయంలో భక్తులు తక్కువ సమయంలో సౌకర్యవంతమైన ప్రయాణం ఆస్వాదిస్తారు. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే ఇందులో సౌకర్యవంతమైన సీట్లు, హై-స్పీడ్ ప్రయాణం, Wi-Fi, ఆన్ బోర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్, స్పెషల్ క్లీనింగ్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ వందే భారత్ రైలు భక్తులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.


మహా కుంభమేళా 34వ రోజు..

ఈ రోజు మహాకుంభ మేళా 34వ రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు గత 33 రోజుల సమయంలో కుంభమేళాకు 50 కోట్లకు పైగా భక్తులు వచ్చి, పవిత్ర సంగమంలో స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. వారాంతం వచ్చిన నేపథ్యంలో సంగమం ఒడ్డున జనసమూహం మరింత అధికం కానుంది. ఈ నేపథ్యంలో యాత్రికులు, సాధువులు, ఋషులు, భక్తులు పవిత్ర సంగమం వద్ద పూజలు, స్నానాలు చేయడానికి ఇంకా తరలివెళ్తున్నారు. రద్దీ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ సంగమం రైల్వే స్టేషన్ ఫిబ్రవరి 16 వరకు మూసివేయబడుతుందని ప్రకటించారు.


అప్రమత్తంగా ఉండాలని..

నగరంలో పరిస్థితి కంట్రోల్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో RPF, GRP సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహా కుంభ నగరంలో పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు రద్దీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శనివారం ఫాల్గుణ మాసం కృష్ణ పక్ష తృతీయ నేపథ్యంలో భక్తులు, సాధువులు, ఋషులు, గృహస్థులు, ఆధ్యాత్మిక పర్యాటకులు కూడా సంగమంలో ప్రత్యేకంగా స్నానం చేసేందుకు తరలివస్తుంటారు. అయితే ఈ రోజు సంగమంలో స్నానం చేస్తే ఒక నెల పాటు కల్పాలు చేసిన పుణ్యాన్ని పొందుతారని భక్తుల నమ్మకం.


ఇవి కూడా చదవండి:

Road Accident: కుంభమేళా వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి, 19 మందికి గాయాలు


PM Modi: విదేశీ పర్యటన తర్వాత.. ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ


OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్


New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 15 , 2025 | 10:54 AM