MK Stalin: స్టాలిన్ దూకుడు.. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై సూచనలకు కమిటీ
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:41 PM
రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

చెన్నై: సుప్రీంకోర్టు ఆదేశాలతో పెండింగ్‌లో ఉన్న 10 బిల్లులకు గవర్నర్ ఆమోదం లేకుండానే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన ఎంకే స్టాలిన్ (MK Stalin) సారథ్యంలోని తమిళనాడు ప్రభుత్వం మంగళవారంనాడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల ప్రతిపత్తి (State autonomy)పై సూచనలకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్చి జస్టిస్ కురియన్ జోసెఫ్ సారథ్యంలో కమిటీ స్వయంప్రతిపత్తి కోసం తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేస్తుందని చెప్పారు. పలు అంశాలపై తమిళనాడుకు, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో స్టాలిన్ తాజా నిర్ణయం తీసుకున్నారు.
Yogi Adityanath: బంగ్లాదేశ్‌కు వెళ్లిపోండి: యోగి ఆదిత్యనాథ్
రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆరోపించారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దీనిపై కమిటీ రీసెర్చ్ చేసి నివేదిక అందిస్తు్ందని అన్నారు. అసెంబ్లీ రూల్ నెంబర్ 110 కింద ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ నిబంధన కింద ముఖ్యమంత్రి లేదా మంత్రి చేసే ప్రకటనపై తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు విపక్షాలకు ఉండదు.
కాగా, రాష్ట్ర ప్రతిపత్తిపై ఏర్పాటు చేసిన కమిటీలో ఇద్దరు ప్రభుత్వ అధికారులు అశోక్ షెట్టి, ఎంయు నాగరాజన్ సభ్యులుగా ఉంటారు. 2026 జనవరిలో కమిటీ మధ్యంతర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సాఫార్సులతో కూడిన తుది నివేదికను రెండేళ్లలోగా సమర్పించే అవకాశం ఉంది.
అసెంబ్లీలో సీఎం విమర్శలు
రాష్ట్రాల స్వయంప్రతిపత్తిపై కమిటీ ఏర్పాటు ప్రకటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఎన్‌ఈపీని రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకిస్తుండటంతో ప్రతీకార చర్యగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రూ.2,500 కోట్ల నిధులను కేంద్ర నిలిపేసిందని ఉన్నారు. ''నీట్ పరీక్షల వల్ల చాలామంది విద్యార్థులను మనం కోల్పోయాం. మనం మొదట్నించీ నీట్ పరీక్షలను వ్యతిరేకిస్తూ వస్తున్నాం. త్రిభాషా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది. ఎన్‌ఈపీని కాదన్నందుకు రూ.2,500 కోట్లను కేంద్రం విడుదల చేయకుండా ఆపేసింది'' అని సీఎం అన్నారు.
ఇవి కూడా చదవండి..