Share News

Foreign Degrees: విదేశీ డిగ్రీకి దేశీయ పట్టా

ABN , Publish Date - Apr 06 , 2025 | 02:17 AM

విదేశీ డిగ్రీలను గుర్తించేందుకు యూజీసీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. పొదుపుగా, వేగంగా డిగ్రీల సమీక్ష జరిగేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, అభ్యర్థులు పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Foreign Degrees: విదేశీ డిగ్రీకి దేశీయ పట్టా

యూజీసీ కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యావిధానంలో భాగంగా విదేశాలతో భారత్‌ అకడమిక్‌ రంగంలో భాగస్వామ్యం కుదుర్చుకున్న రీత్యా విదేశీ డిగ్రీలను గుర్తించేందుకు యూజీసీ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ విద్యార్హతలతో తిరిగి వచ్చే విద్యార్థులను భారతీయ ఉన్నత విద్యావ్యవస్థలో భాగం చేసేందుకు వీలుగా ఎలాంటి జాప్యం లేకుండా వారి డిగ్రీలను సమీక్షించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, నిబంధనలను రూపొందించినట్లు యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ శనివారం వెల్లడించారు. తాజా నిబంధనల ప్రకారం విదేశీ విద్యాసంస్థల నుంచి పొందిన డిగ్రీలకు సమానంగా ఈక్వివాలెన్స్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు యూజీసీ ఏర్పాటు చేసిన పోర్టల్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కమిషన్‌ నియమించిన స్టాండింగ్‌ కమిటీ పదిరోజుల్లో ఈ దరఖాస్తులను పరిశీలించి సర్టిఫికెట్‌ జారీ చేస్తుంది. ఈ సర్టిఫికెట్‌ పోర్టల్‌లోనే లభ్యమవుతుంది. దరఖాస్తులో పేర్కొన్న వివరాల పట్ల కమిటీ సంతృప్తి చెందకపోతే 15 రోజుల్లోపు అదనపు సమాచారాన్ని సమర్పించాల్సిందిగా కోరుతుంది. దరఖాస్తు తిరస్కరణకు గురైన పక్షంలో 30 పనిదినాల్లో నిర్దిష్ట ఫీజు చెల్లించి పునఃపరిశీలన కోరవచ్చు. దానిని ప్రత్యేక రివ్యూ కమిటీ తిరిగి పునఃపరిశీలించి పది రోజుల్లో తన నిర్ణయాన్ని తెలుపుతుంది. మెడిసిన్‌, ఫార్మసీ, నర్సింగ్‌, లా, ఆర్కిటెక్చర్‌ రంగాల్లో విదేశీ విద్యాసంస్థలు ప్రదానం చేసే డిగ్రీలకు ఇది వర్తించదని, వాటిని గుర్తించేందుకు ఇప్పటికే చట్టబద్ధమైన కౌన్సిళ్లు ఉన్నాయని ఆయన చెప్పారు


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 02:18 AM