Share News

Union Budget 2025: బడ్జెట్‌లో పరిమిత కేటాయింపులు.. జనగణన మరింత జాప్యం

ABN , Publish Date - Feb 01 , 2025 | 06:34 PM

కేంద్ర కేబినెట్ 2019 డిసెంబర్ 24న జరిపిన సమావేశంలో రూ.8,754 కోట్ల వ్యయంతో 2021లో జనాభా లెక్కల సేకరణ, రూ.3,941.35 కోట్లతో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అప్డేషన్ చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఆ ప్రక్రియ జరగాల్సి ఉంది.

Union Budget 2025: బడ్జెట్‌లో పరిమిత కేటాయింపులు.. జనగణన మరింత జాప్యం

న్యూఢిల్లీ: దేశంలో జనాభా లెక్కల సేకరణ (Census)లో మరితం జాప్యం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) శనివారంనాడు సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో జనగణన, జాతీయ జనాభా పట్టిక (NPR) ప్రక్రియ కోసం పరిమితమైన కేటాయింపులు మాత్రమే జరిపారు. ఇందుకోసం రూ.574.80 కోట్లు కేటాయించారు.

Rahul Gandhi: బుల్లెట్ గాయానికి బ్యాండ్ఎయిడ్.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విసుర్లు


కేంద్ర కేబినెట్ 2019 డిసెంబర్ 24న జరిపిన సమావేశంలో రూ.8,754 కోట్ల వ్యయంతో 2021లో జనాభా లెక్కల సేకరణ, రూ.3,941.35 కోట్లతో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అప్డేషన్ చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఆ ప్రక్రియ జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ మహమ్మారి చెలరేగడంతో ఆ ప్రతిపాదన వాయిదా పడింది. అప్పట్నించి ఈ ప్రక్రియను ప్రభుత్వం నిలిపి ఉంచింది. కొత్త షెడ్యూల్‌ను ఇంతవరకూ ప్రకటించలేదు. 2021-22 బడ్జెట్‌లో ఇందుకోసం రూ.3,768 కోట్లు కేటాయించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ క్రమంలో 2025-2026 బడ్జెట్‌లో కేవలం రూ.574.80 కోట్లను మాత్రమే ప్రకటించడంతో ఈసారి కూడా జనగణన ఉండకపోవచ్చని అంటున్నారు.


Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే

Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..

Union Budget For Start-Ups: బడ్జెట్‌లో స్టార్టప్‌లకు సూపర్ న్యూస్.. లక్షల వర్షం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 06:34 PM