Share News

Budget 2025 Latest News: ఈ బడ్జెట్‌తో సామాన్యుడికి కలిగే ప్రయెజనాలు ఇవే

ABN , First Publish Date - Feb 01 , 2025 | 09:57 AM

యూనియన్ బడ్జెట్ 2025-26లో అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి, ఏ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించారు. మొత్తంమీద ఇవాల్టి బడ్జెట్‌లో హైలెట్స్ ఆంధ్రజ్యోతి లైవ్ అప్‌డెట్స్‌లో చూడండి.

Budget 2025 Latest News: ఈ బడ్జెట్‌తో సామాన్యుడికి కలిగే ప్రయెజనాలు ఇవే
Union Budget

Live News & Update

  • 2025-02-01T18:38:46+05:30

    కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు తీరని అన్యాయం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

    నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌డిఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయి.కేంద్ర జిడిపిలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉన్నా ఆమేరకు నిధులు విదల్చలేదు. రాష్ట్రం నుంచి పన్నులు రూపంలో రూ.26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయి. గతంలో కంటే 12 శాతం పెరిగినా రాష్ట్రంపై చిన్నచూపు చూడటానికి రాజకీయ కారణాలే కారణం. బిజెపికి 8 మంది ఎంపీలను ఇచ్చినా కూడా తెలంగాణా ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసింది. బీహార్, దిల్లీ, ఏపీ, గుజరాత్ లకు మాత్రమే ఫ్రాధాన్యతనివ్వడం కక్ష సాధింపు కాదా. సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్కలు పలుసార్లు ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలిసి రూ.1.63 వేల కోట్ల సహాయం కోసం అర్థించారు.

  • 2025-02-01T18:15:33+05:30

    ఢిల్లీ: కాంగ్రెస్ నేతలు బడ్జెట్ పూర్తిగా చూడలేదు: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

    • సభలో ఈరోజు ఎంపీలు వాకౌట్ చేసి బయటకు వచ్చారు.

    • కేంద్రం పెట్టిన బడ్జెట్ ఇది పూర్తిగా ప్రజల బడ్జెట్.

    • ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 12 లక్షలకు పెంచారు.

    • మధ్యతరగతి వారు అనుకున్నది జరిగింది.

    • 75 వేల మెడికల్ సీట్లు అదనంగా ఇచ్చారు.

    • కిసాన్ క్రెడిట్ కార్డులు పెంచారు.

    • కస్టమ్స్ డ్యూటీ కూడా తగ్గించారు.

    • బడ్జెట్ ఢిల్లీ, బీహార్ ఎన్నికల కొరకు పెట్టారు అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విమర్శిస్తున్నారు.

    • కొత్తగా ఎంపీలు అయ్యారు వారికి బడ్జెట్ పై అవగాహన లేదు.

  • 2025-02-01T18:11:15+05:30

    ఢిల్లీ: బడ్జెట్‌పై ఈటెల రాజేందర్ స్పందన..

    • కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్ వారి ఇంటర్నల్ మ్యాటర్.

    • ప్రజల్లో త్వరగా విశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్.

    • ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి వారికి అన్ని తెలుస్తాయి.

    • కాంగ్రెస్ పరిపాలన గురించి మాకేం తెలుస్తుంది.

    • ప్రజలు బిఆర్ఎస్ పార్టీని అన్ని విధాలుగా చూశారు.

    • కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది

    • బిజేపి వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది.

    • ప్రజల్లో ఉన్న భావన బీజేపీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారు.

  • 2025-02-01T18:06:17+05:30

    కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు: జగ్గారెడ్డి

    • తెలంగాణ ప్రజలు ఏడాదికి రూ.లక్ష కోట్ల పన్ను కడుతున్నారు.

    • తెలంగాణ ప్రజలు బీజేపీని 8 సీట్లలో గెలిపించారు.

    • బడ్జెట్‌పై కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఏం చెప్తారు?

  • 2025-02-01T17:54:31+05:30

    ఢిల్లీ : దేశ అప్పు ఎంతో తెలుసా..

    • 2025-26 ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం అప్పులు రూ. 196 లక్షల 78 వేల 772.86 కోట్లుగా అంచనా.

    • 2024-25 బడ్జెట్‌ సవరించిన అంచనాల ప్రకారం రూ. 181లక్షల 74 వేల 284.36 కోట్లుగా ప్రకటించిన కేంద్రం.

    • అంతర్గత అప్పులు, విదేశాల నుంచి తీసుకున్న అప్పులు కలిపి ఈ ఏడాది మార్చి నాటికి రూ. 181లక్షల 74 వేల 284.36 కోట్లుగా బడ్జెట్‌లో ప్రకటన.

    • వీటిలో... ఈ ఏడాది మార్చి 31 నాటికి అంతర్గతంగా తీసుకున్న అప్పులు... రూ. 175లక్షల 55వేల 988.60 కోట్లు... కాగా.. 2026 నాటికి రూ. 190లక్షల 14వేల 852.01 కోట్లకు చేరుతుందని అంచనా.

    • విదేశాల నుంచి తీసుకున్న అప్పులు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 6లక్షల 18వేల 295.76 కోట్లు కాగా.. 2026 నాటికి రూ. 6లక్షల 63 వేల 920.67 కోట్లకు చేరుతుందని అంచనా.

    • మొత్తంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 181లక్షల 74 వేల 284.36 కోట్ల అప్పులు ఉంటే.. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రూ.190లక్షల 14వేల 852.01 కోట్లకు చేరనున్న దేశ అప్పు.

  • 2025-02-01T16:11:08+05:30

    తేలిన లెక్క..కేంద్ర బడ్జెట్‌పై వచ్చిన క్లారిటీ

    కేంద్ర బడ్జెట్లో తెలంగాణాకు దక్కని నిధులు.

    రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోని కేంద్రం

    ప్రతిష్టాత్మక పథకాలకు కేంద్ర బడ్జెట్లో లేని కేటాయింపులు

    ఇక తెలంగాణ బడ్జెట్ పై రేవంత్ సర్కార్ ఫోకస్

    బడ్జెట్ రూపకల్పన పై దృష్టి.

    కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, ఆర్థిక శాఖా అధికారులతో సీఎం భేటీ.

    కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపుల పై ఆరా.

    తెలంగాణా2025-26 బడ్జెట్ ను రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశం.

    వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనల పై చర్చ.

  • 2025-02-01T15:37:31+05:30

    ఏపీ ప్రజలతరఫున నిర్మలకు ధన్యవాదాలు: రామ్మోహన్‌నాయుడు

    Rammohan-Naidu.jpg

    • ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలనేది ప్రధాని మోదీ ఆలోచన.

    • వైసీపీ ప్రభుత్వంలో జల్ జీవన్ నిధులు దుర్వినియోగం.

    • 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు.

    • ఏపీకి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేస్తాం

    • ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెస్తాం.

    • పౌరవిమానరంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

    • వుడాన్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

    • ఏపీలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి.

  • 2025-02-01T15:32:51+05:30

    బడ్జెట్‌పై హరీష్ రావు కామెంట్స్..

    • అంతట అంబేద్కర్ విగ్రహం నిలబడి ఉంటే ఇక్కడ కూర్చొని ఉన్నాడు

    • అంబేద్కర్ విగ్రహం పెట్టడం కన్నా ఆయన ఆశయాలను కొనసాగించాలి

    • ఆర్టికల్ 3అంబేద్కర్ పొందుపర్చక పోతే నేటికీ రాష్ట్రం వచ్చేది కాదు

    • కెసిఆర్ దళిత బందు 10లక్షలతో ప్రారంభిస్తే నేటి ప్రభుత్వం దాని పై ఉలుకు పలుకు లేదు

    • 125అడుగుల అంబేద్కర్ విగ్రహం కెసిఆర్ పెడితే రేవంత్ రెడ్డి బేడీలు వేసాడు

    • భేషజాలకు పోకుండా రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం అందురు చూసేలా అవకాశం కల్పించాలి

    • అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని కెసిఆర్ ప్రారంభించాడు

    • ఈ ప్రభుత్వం వచ్చి 14నెలలు అయినా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ విడుదల చేయలేదు

    • గతంలో రాజశేఖర్ రెడ్డి ఎన్నో మంచి పథకాలు తెచ్చారు వాటిని కెసిఆర్ అమలు చేశారు

    • అంబేద్కర్ విగ్రహం లేని ఊరు సిద్దిపేట నియోజక వర్గంలో ఉండ వద్దని అంతట విగ్రహాలు ఏర్పాటు చేశాం

    • భారతదేశ బడ్జెట్ తుంగలో తొక్కేలా ఉంది

    • నిర్మల సీతరామన్ బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు కాకుండా కొన్ని రాష్ట్రాలకూ అన్నట్లు ఉంది

    • పోయినసారి ఆంధ్రకు, ఈసారి బీహార్ కి బడ్జెట్ లో పెద్దపీట వేసి తెలంగాణకి మొండిచేయి చూపారు

    • దేశాన్ని మనం సాదుతున్నాం కానీ వారు మనుకు మొండిచేయి చూపారు

    • ఈ బడ్జెట్ బీహార్ బడ్జెట్

    • బడేబాయ్ అని మోడీని రేవంత్ మెచ్చుకుంటున్నారు కానీ బడేబయ్ ఈ చోటే బాయ్ పట్టించుకోవడం లేదు

    • బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కు పూర్తి మద్దతు ఇస్తుంది

    • రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేష్ణలో వర్గీకరణ ప్రకారం అమలు చేయాలి.

  • 2025-02-01T15:16:35+05:30

    బడ్జెట్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్..

    • పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూనే.. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే ‘డ్రీమ్ బడ్జెట్’ ఇది.

    • వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేలా రూపొందించిన బడ్జెట్.

    • వ్యక్తిగత ఇన్ కమ్ టాక్స్ పరిధిని 12 లక్షలకు పెంచడం చాలా పెద్ద నిర్ణయం.

    • MSMEలు, చిన్న పరిశ్రమలు ఆపన్నహస్తాన్ని అందించిన బడ్జెట్.

    • రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ.. సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించిన బడ్జెట్ ఇది.

    • అన్ని సంక్షేమ పథకాలకు నిధులను పెంచడం అభినందనీయం.

    • ప్రధానమంత్రి మోదీ గారికి, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ గారికి ధన్యవాదములు.

  • 2025-02-01T15:14:01+05:30

    రైతులకు అదిరిపోయే వార్త ఇదే..

    రైతులకు తక్కువ వడ్డీకే రుణాలిచ్చే కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

    Kisan Credit Card.jpg

    పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • 2025-02-01T14:55:01+05:30

    2025-26 ఆర్థిక బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు

    • పోలవరం ప్రాజెక్టుకు రూ.400 కోట్లు అధికంగా కేటాయింపు

    • విశాఖ పోర్టుకు రూ.445 కోట్లు పెంపు

    • జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కి రూ.100 కోట్లు పెంపు

    • ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు కొత్తగా కేటాయింపు

    • లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆపరేషన్‌కి మద్దతుగా రూ.75 కోట్లు పెంపు

    • పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు

    • విశాఖ స్టీల్‌కు రూ.3,295 కోట్లు

    • విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు

    • జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి రూ. 186 కోట్లు

    • ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ. 162 కోట్లు

    • లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా రూ. 375 కోట్లు

    • ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టుకు రూ.240 కోట్లు

    • ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు 2వ దశకు రూ.242.50 కోట్లు

    • గత ఏడు నెలల్లో కేంద్రం నుంచి..

    • ఏపీలో వివిధ ప్రాజెక్టులకు వచ్చిన నిధులు వివరాలు

    • అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు

    • విశాఖ స్టీల్ ప్లాంట్‌కి రూ.11,440 కోట్లు

    • నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌కి రూ.14 వేల కోట్లు

    • వెనుకబడిన జిల్లాలకు రూ. 1,750 కోట్లు

    • గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు రూ.1.8లక్షల కోట్లు

    • పోలవరం ప్రాజెక్టుకు రూ.2,800 కోట్లు

    • పారిశ్రామిక కారిడార్లకు రూ.4,936 కోట్లు

    • BPCL రిఫైనరీకి రూ.95వేల కోట్లు

  • 2025-02-01T14:45:19+05:30

    బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర కీలక ప్రసంగం..

    ‘ఇది ప్రజల బడ్జెట్‌. ఈ బడ్జెట్‌లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. తయారీ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాం. ఇది నూటికి నూరు శాతం అభివృద్ధి బడ్జెట్. దేశంలో పెట్టుబడులకు ఈ బడ్జెట్ బూస్ట్ ఇస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్‌ను మరింత బలోపేతం చేస్తోంది. ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్‌తో లబ్ధి చేకూరుతుంది. ప్రజలను మిగతా ప్రభుత్వాలు దోచుకుంటే.. మేము ప్రజలకు డబ్బులు ఇస్తున్నాం.’

  • 2025-02-01T13:50:47+05:30

    బడ్జెట్‌పై రియాక్షన్స్

    • బడ్జెట్‌లో కొత్తదనం ఏమి లేదన్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్

  • 2025-02-01T12:21:16+05:30

    కొత్త పన్ను శ్లాబులు సవరణ

    • రూ.0-4 లక్షలు - సున్నా

    • రూ.4-8 లక్షలు - 5%

    • రూ.8-12 లక్షలు - 10%

    • రూ.12-16 లక్షలు - 15%

    • రూ.16-20 లక్షలు - 20%

    • రూ.20-24 లక్షలు - 25%

    • రూ.24 లక్షల పైన 30 శాతం

  • 2025-02-01T12:15:39+05:30

    రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్

    • మధ్యతరగతి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్

    • రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదన్న కేంద్రం

  • 2025-02-01T11:45:35+05:30

    పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్

    • పన్నుల చెల్లింపుల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం

    • ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపు

  • 2025-02-01T11:42:31+05:30

    ఎగుమతులపై స్పెషల్ ఫోకస్

    • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు

    • దేశీయంగా తయారీ పరిశ్రమలకు మద్దతు

  • 2025-02-01T11:42:30+05:30

    బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు

    • అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు: నిర్మల

    • 2025-26లో 200 క్యాన్సర్‌ సెంటర్లు ఏర్పాటు: నిర్మల

    • పట్టణ పేదలు, వర్తకులకు చేయూత: నిర్మల

    • వర్తకులకు రూ.30 వేల పరిమితితో UPI క్రెడిట్‌ కార్డులు: నిర్మల

    • గిగ్‌ వర్కర్లకు ఈ-శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా ఐడీ కార్డులు: నిర్మల

  • 2025-02-01T11:28:39+05:30

    ఆరోగ్య రంగంలో కీలక నిర్ణయాలు

    • ప్రతి జిల్లా ఆసుపత్రి కేంద్రాల్లో క్యాన్సర్ కేంద్రాలు

    • 200 జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు

    • 2025-26 సంవత్సరంలోనే క్యాన్సర్ కేంద్రాలు

  • 2025-02-01T11:26:09+05:30

    విద్యారంగంలో సంస్కరణలు

    • విద్యారంగంలో ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది

    • అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నాం

  • 2025-02-01T11:19:20+05:30

    సూక్ష్మ. మధ్య తరహా పరిశ్రమలకు క్రెడిట్ కార్డులు

    • రూ.10లక్షల విలువైన క్రెడిట్ కార్డులు

    • మొదటి సంవత్సరం 10 లక్షల కార్డులు జారీ

    • స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యం

    • ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కింద రూ.2కోట్ల రుణాలు

  • 2025-02-01T11:08:14+05:30

    వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత

    • వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది

    • రైతుల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం

    • వంద జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునూతన పద్ధతులను అమలుచేస్తాం

    • గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టించడానికి చర్యలు

    • రైతుల నుంచి నేరుగా పప్పు ధాన్యలు సేకరణ

  • 2025-02-01T10:39:10+05:30

    Nirmala Sitharaman.jpg

    ఎనిమిదోసారి బడ్జెట్

    • ఎనిమిదోసారి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

    • ఇప్పటివరకు ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సీతారామన్

  • 2025-02-01T10:27:54+05:30

    బడ్జెట్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం

    • యూనియన్ బడ్జెట్‌కు కేంద్రమంత్రి మండలి ఆమోదం

  • 2025-02-01T09:57:10+05:30

    రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి

    • రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

    • కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారమన్

    • బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతిని కలిసిన ఆర్థికమంత్రి

    • కాసేపట్లో కేంద్ర మంత్రిమండలి సమావేశం

    • బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి