Union Budget 2025:పార్లమెంట్ ఉభయసభలు శనివారానికి వాయిదా..
ABN , First Publish Date - Jan 31 , 2025 | 09:44 AM
Budget 2025 Live Updates in Telugu News: కేంద్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలిరోజు సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

Live News & Update
-
2025-01-31T13:47:59+05:30
పార్లమెంట్ ఉభయసభలు శనివారానికి వాయిదా..
రాజ్యసభ పదవికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసినట్లు, రాజీనామా ఆమోదించినట్లు సభకు తెలిపిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్.
2024-25 ఆర్ధిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.
పార్లమెంట్ ఉభయసభలు శనివారానికి వాయిదా.
-
2025-01-31T13:46:32+05:30
లోక్‌సభ శనివారానికి వాయిదా..
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
2024-25 ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
అనంతరం లోక్‌సభను శనివారానికి వాయిదా వేశారు.
-
2025-01-31T12:05:20+05:30
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి.
పోలవరం నిర్మాణానికి రూ.12 వేల కోట్లు.
సైబర్ సెక్యూరిటీలో సమర్థత పెంచుతున్నాం.
దేశ ఆర్థిక, సామాజిక, జాతీయ భద్రతకు.. డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్, డీప్ ఫేక్ పెనుముప్పు.
దళితులు, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు.. ఆదివాసీ ప్రాంతాల్లో 30 వైద్య కళాశాలలు ప్రారంభించాం.
అందుబాటులోకి అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు.
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.
పెరుగుతున్న క్యాన్సర్ కేసుల దృష్ట్యా.. పలు క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకం తగ్గించాం.
రక్షణ రంగంలో ఆత్మనిర్భర్‌కు ప్రాధాన్యం.
అటల్, సోన్‌మార్గ్ టెన్నెల్స్ వంటివి నిర్మించాం.
భారత్ మెట్రో వ్యవస్థ వెయ్యి కి.మీ. మైలురాయి దాటింది.
సహకార రంగంలో అనేక ఉద్యోగాలు కల్పిస్తున్నాం.
డిజిటల్ సాంకేతికతలో భారత్ కీలక పాత్ర.
రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం.
-
2025-01-31T11:38:46+05:30
MSMEల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ తీసుకొచ్చాం: ముర్ము
ఇ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం: ముర్ము
ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నాం: ముర్ము
దేశీయ పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందుతోంది: ముర్ము
-
2025-01-31T11:30:50+05:30
భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం.
ఇండియా AI మిషన్‌ను ప్రారంభించాం.
నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం.
స్పోర్ట్స్ నుంచి స్పేస్ వరకు భారత్ దూసుకుపోతోంది.
-
2025-01-31T11:30:17+05:30
ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని నియమించాం.
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం.
ట్యాక్స్ విధానాలను సరళీకరించాం.
భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు.
70 ఏళ్లు దాటిన 6 కోట్లమందికి ఆరోగ్య బీమా.
యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి. భారతీయులు అంతరిక్షంలో అడుగుపెట్టే రోజు దగ్గర్లోనే ఉంది.
భారత మహిళలు ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తున్నారు.
విద్యా రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.
-
2025-01-31T11:28:37+05:30
President Droupadi Murmu Speech on Budget: రాష్ట్రపతి ప్రసంగం కీలక అంశాలు..
బడ్జెట్‌లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం.
మా ప్రభుత్వం మూడో టెర్మ్‌లో.. మూడు రెట్ల వేగంతో అభివృద్ధి సాగుతోంది.
దేశాభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం.
రూ.70 వేల కోట్లతో గ్రామీణ రహదారుల అభివృద్ధి.
3 కోట్లమంది పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నాం.
దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే మా లక్ష్యం.
-
2025-01-31T11:12:33+05:30
President Droupadi Murmu Speech on Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
మాజీ ప్రధాని మన్మోహన్‌కు పార్లమెంట్ నివాళులు
మన్మోహన్ సేవలను కొనియాడిన పార్లమెంట్
ఇటీవల మరణించిన సభ్యులకు పార్లమెంట్ నివాళులు
మహా కుంభమేళా మృతులకు పార్లమెంట్ నివాళులు
-
2025-01-31T11:03:54+05:30
ప్రారంభమైన బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు..
ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
-
2025-01-31T10:45:55+05:30
ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సహా..
పలువురికి నివాళులు అర్పించనున్న పార్లమెంట్
అమెరికా మాజీ అధ్యక్షుడు జేమ్స్ ఎర్ల్ కార్టర్ జూనియర్‌కు..
నివాళులు అర్పించనున్న పార్లమెంట్
-
2025-01-31T10:30:20+05:30
పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ ప్రసంగం..
దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలపై.. లక్ష్మీదేవి కరుణ చూపాలని ఆకాంక్షిస్తున్నా.
సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలి.
బడ్జెట్ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలి.. బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలని కోరుతున్నా.
ఈ బడ్జెట్ వికసిత్ భారత్‌కు ఊతం ఇస్తుంది.
ఈ బడ్జెట్ వికసిత్ భారత్‌కు ఊతం ఇస్తుంది.
ఇన్నొవేషన్, ఇన్‌క్లూషన్, ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.
రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.
కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది.
-
2025-01-31T10:04:53+05:30
నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్..
వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి ఆర్థిక మంత్రిగా రికార్డ్ సృష్టించబోతున్నారు.
-
2025-01-31T10:03:07+05:30
ఈ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది..
ఎయిర్‌క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ ప్రొటెక్షన్ బిల్లు
వక్ఫ్ సవరణ బిల్లు
ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు
బ్యాంకింగ్, రైల్వే, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బిల్లులు
2025 ఫైనాన్స్ బిల్లు.
మొత్తంగా 10 బిల్లుల వరకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
-
2025-01-31T10:01:18+05:30
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమైన తేదీలివే..
జనవరి 31 - కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికను లోక్‌సభలో ప్రవేశపెడతారు.
ఫిబ్రవరి 1 - కేంద్ర బడ్జెట్ 2024-25ను నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు.
ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాల తొలి విడత ఉంటుంది.
మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సమావేశాల తొలి విడత ఉంటుంది.
మొత్తం 27 రోజులపాటూ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.
-
2025-01-31T09:44:16+05:30
Union Budget 2025 Live Updates : శుక్రవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగించనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. ఇవి తొలి విడత బడ్జెట్ సమావేశాలు మాత్రమే. తొలి విడతలో మొత్తం 9 రోజులపాటు బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. మలి విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగుతాయి. మలి విడతలో మొత్తం 18 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 3వ తేదీన ఉభయ సభల్లోనూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది.