VIP Darshan: 3 రోజులు వీఐపీ దర్శనాలు బంద్.. మహాశివరాత్రి వేళ కీలక నిర్ణయం..
ABN , Publish Date - Feb 23 , 2025 | 08:53 PM
మహా శివరాత్రి పండగ వస్తే చాలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం ట్రస్ట్ వీఐపీ దర్శనాలను మూడు రోజుల పాటు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

మహా శివరాత్రి శివ భక్తులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి, శివాలయాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం(Kashi Vishwanath Temple)లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27, 2025 వరకు మూడు రోజుల పాటు ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు (VIP Darshan) ఉండవని స్పష్టం చేసింది.
వీఐపీ దర్శనాలు నిషేధం
ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం, మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీని నియంత్రించడం. ఈ సమయంలో సాధువులు, నాగ సాధువులతోపాటు అనేక మంది భక్తజనం దర్శనం కోసం వచ్చేస్తారు. అందువల్ల ఆలయ ట్రస్ట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ క్రమంలో భక్తులందరికీ సమానంగా, సజావుగా దర్శనం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. ఈ నిర్ణయం ప్రకారం VIP పాస్ హోల్డర్లు కూడా సాధారణ భక్తుల మాదిరిగానే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వారు కూడా దూరం నుంచి శివుడిని చూసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది.
భక్తుల సంఖ్య
ఈ నిర్ణయం ద్వారా ఆలయ ట్రస్ట్ భక్తుల సౌకర్యాన్ని, భద్రతను కాపాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అనేక రెట్లు పెరుగుతుంది. ఈ సమయంలో ఆలయ పరిసరాల్లో భారీగా జనసంచారం ఉంటుంది. అందుకే భక్తుల రద్దీని నియంత్రించడం చాలా అవసరం. ఈ నిర్ణయం ద్వారా ఆలయ ట్రస్ట్.. భక్తులకు సౌకర్యంగా, సురక్షితంగా దర్శనం పొందే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చింది. ఈ సందర్భంలో సాధువుల దర్శనానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఈ క్రమంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ట్రస్ట్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు ఆలయానికి చేరుకునే సమయంలో, వారికి సౌకర్యంగా ఉండేందుకు ప్రత్యేక వసతులను సిద్ధం చేస్తుంది. భక్తుల భద్రతను కాపాడేందుకు, ఆలయ పరిసరాల్లో పోలీసులు, స్వచ్ఛంద సేవకులు విధులు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు మహాశివరాత్రి ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ట్రస్ట్ కోరింది.
ఇవి కూడా చదవండి:
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు.. మళ్లీ దాడులు షురూ..
Pakistan Bangladesh: 54 ఏళ్ల తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం పునఃప్రారంభం
Viral Video: ప్రధాని మోదీ, ట్రంప్‌ని మెచ్చుకున్న మహిళా ప్రధాని.. వారిపై విమర్శలు..
Upcoming IPOs: పెట్టుబడిదారులకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News