Share News

Minister: కావేరి-గుండారు-వైగై నదుల అనుసంధానం చేసి తీరతాం..

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:02 PM

గత ఎన్నికల సమయంలో మేం ఇచ్చిన మాట ప్రకారం కావేరి-వైగై-గుండారు నదుల అనుసంధానం చేసి తీరుతామని మంత్రి దురైమురుగన్‌ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. నదుల అనుసంధానం విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమాలు అవసరం లేదన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఆ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి పేర్కొన్నారు.

Minister: కావేరి-గుండారు-వైగై నదుల అనుసంధానం చేసి తీరతాం..

- మంత్రి దురైమురుగన్‌ ప్రకటన

చెన్నై: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు కావేరి-వైగై-గుండారు నదుల(Kaveri, Vaigai, and Gundar Rivers) అనుసంధానం చేసి తీరుతామని అసెంబ్లీలో మంగళవారం మంత్రి దురైమురుగన్‌(Minister Suraimurugan) ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఉదయం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో నీటి కొరత పరిష్కరించేలా నదులు అనుసంధానం చేస్తారా అని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి సి.విజయభాస్కర్‌ ప్రశ్నించారు.

ఈ వార్తను కూడా చదవండి: E-Pass: ఊటీ, కొడైకెనాల్‌లో ఈ-పాస్‌ ప్రారంభం


అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన కావేరి-వైగై-గుండారు నదుల అనుసంధానం పథకం పనులు వేగవంతం చేసినట్లయితే, పుదుకోట జిల్లాలో ఉన్న రైతులు లబ్ధిపొందుతారని, వేలాది ఎకరాల భూములకు సాగు నీరు అందుతుందని తెలిపారు. పుదుకోట, శివగంగ, రామనాథపురం జిల్లాల్లో సాగు, తాగునీటి కొరత అధికమవుతోందని, ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వర్షాకాలం ప్రారంభం కాకముందే నదుల అనుసంధానం చేయాలని సూచించారు.


అదే సమయంలో, ప్రస్తుత బడ్జెట్‌లో నదులు అనుసంధానానికి నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి దురైమురుగన్‌ సమాధానమిస్తూ... ఈ పనుల నిమిత్తం 2022లో కేటాయించిన రూ.146 కోట్లలో ఇప్పటివరకు రూ.116 కోట్లు ఖర్చయిందని, 47 శాతం కాలువ తవ్వకాల పనులు పూర్తయ్యాయని వివరించారు. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో రూ.176 కోట్లు కేటాయించి అందులో రూ.128 కోట్లు ఖర్చుచేశామని, 86 శాతం కాలువ తవ్వకాల పనులు పూర్తయ్యాయన్నారు.


ఈ సంవత్సరం కేటాయించిన రూ.50 కోట్ల నిధులలో ఇప్పటివరకు రూ.33 కోట్లు ఖర్చయిందని, 89 శాతం కాలువ తవ్వకాలు పూర్తయ్యాయని, మిగతా పనులు రెండు నెలల్లో పూర్తిచేయాలని ఉత్తర్వులు జారీచేసినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు మినహాయించి భూసేకరణ పనులు ప్రారంభించామని కరూర్‌, తిరుచ్చి జిల్లాల్లో నీటిపారుదల పనుల కోసం రూ.376 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వ పరిశీలనను పంపినట్లు మంత్రి వివరించారు


ఈ వార్తలు కూడా చదవండి:

Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!

విధ్వంసమే మీ ఎజెండానా

డబుల్‌ బెంబేలు

ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 02 , 2025 | 12:02 PM