Share News

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ABN , Publish Date - Apr 07 , 2025 | 02:57 PM

విమానాన్ని సమీపంలోని చికలథానా విమానాశ్రయానికి మళ్లించారు. రాత్రి 10 గంటలకు విమానం ల్యాండింగ్ అయినప్పటికీ వైద్య సహాయం అందకముందే ఆమె ప్రాణాలు విడిచారు.

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ముంబై: ముంబై నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlains) విమానంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విమానం గాలిలో ఉండగానే ఒక వృద్ధ మహిళ మరణించడంతో విమానాన్ని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని సోమవారంనాడు ధ్రువీకరించారు.

Indian Navy Rescues Sailor: మానవత్వం అంటే ఇది.. పాక్ సిబ్బందికి ఇండియన్ నేవీ సాయం


ఘటన వివరాల ప్రకారం, ఆదివారం రాత్రి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చోటుచేసుకుంది. మృతి చెందిన ప్రయాణికురాలిని ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన 89 ఏళ్ల సుశీల దేవిగా గుర్తించారు. విమానంలో ఉండగానే ఆమె అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది తాత్కాలిక సాయం అందించారు. విమానాన్ని సమీపంలోని చికలథానా విమానాశ్రయానికి మళ్లించారు. రాత్రి 10 గంటలకు విమానం ల్యాండింగ్ అయినప్పటికీ వైద్య సహాయం అందకముందే ఆమె ప్రాణాలు విడిచారు. ఎంఐడీసీ సిడ్కో పోలీస్ స్టేషన్ అధికారులు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయడంతో విమానం తిరిగి వారణాసికి బయలుదేరింది. మహిళ మృతదేహాన్ని ఛత్రపతి శంభాజీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి..

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

For National News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 03:06 PM