Share News

Shocking Video: పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి..

ABN , Publish Date - Feb 10 , 2025 | 11:01 AM

Madhyapradesh: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ పెళ్లి వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న సంగీత్ వేడుకల్లో ఓ యువతి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఏం జరిగిందంటే..

Shocking Video: పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి..
Madhyapradesh

ఆ ఇంట్లో పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివాహమహోత్సవంలో భాగంగా సంగీత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆ ఇంట్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఉత్సహంగా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఓ యువతి కూడా స్టేజ్‌పై డ్యాన్స్‌ పర్ఫామెన్స్ చేస్తోంది. కానీ అంతలో జరిగిన ఓ ఘటనతో అప్పటి వరకు ఆనందోత్సాహాల నడుమ ఉన్న వారు శోకసంద్రంలో ముంచేసింది. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ విషాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ యువతికి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి పెళ్లి వేడుకలో భాగంగా డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా గుండె పోటుతో యువతి మరణించినట్లు వైద్యులు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విధిశా జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన అందరికీ కలచివేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌కు చెందిన పరిణీత జైన్.. తన సోదరి వివాహంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. అందరితో పాటు ఆడుతూపాడుతూ చిందులేసింది. సంగీత్ కార్యక్రమంలో తనకంటూ ఓ ప్రత్యేక పాటను ఎంచుకుని స్టెప్పులేస్తోంది. ఇంతలోనే ఆడుతూ ఆడుతూనే హఠాత్తుగా స్టేజ్‌ పైనే కుప్పకూలి పడిపోయింది యువతి.

ట్రంప్ ఎఫెక్ట్.. రూపాయి మరింత పతనం..


వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. హార్ట్‌ఎటాక్‌ కారణంగా పరిణీత జైన్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పరిణీత మృతితో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. అయితే పరిణీతి సోదరుడు కూడా ఇలానే మృతి చెందినట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే అంటే 12 ఏళ్లకే పరిణీతి సోదరుడు కూడా గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇది జరిగిన చాలా రోజుల తరువాత సోదరుడిలాగే పరిణీతి కూడా హార్ట్‌ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబసభ్యుల బాధ అంతాఇంతా కాదు.


ఇవి కూడా చదవండి...

కుంభమేళాలో తదుపరి అమృత స్నానం ఎప్పుడు?

30కి పైగా బట్టల షాపులకు మంటలు

Read Latest National News And Telugu News

Updated Date - Feb 10 , 2025 | 11:21 AM