పెద్దవాళ్లతో ప్రయాణాలా.. అయితే ఒక్కసారి..
ABN , Publish Date - Apr 06 , 2025 | 09:02 AM
ప్రస్తుతం వేసవి వచ్చేసింది. అలాగే సెలవులు కూడా వస్తున్నాయి. దీంతో చాలామంది తమతమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు ప్లాన్ చేసుకుంటారు. అయితే.. చాలామంది ప్రయాణాలు చేసే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వాటిని ఎలా అధిగమించాలో కాసింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

వేసవి సెలవులు వస్తున్నాయంటే ఫ్యామిలీ ట్రిప్‌లు మొదలవుతాయి. ఫ్యామిలీ అంటే పిల్లలే కాదు... వృద్ధులు కూడా ఉంటారు కదా. అలాంటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా...
ట్రిప్ సాఫీగా సాగాలంటే ట్రావెల్ నిపుణులిస్తున్న కొన్ని సూచనలివి...
హోటల్ లేదా రిసార్ట్ బుక్ చేసుకునే ముందు పెద్దలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయో, లేదో ముందే చెక్ చేసుకోవాలి. అంటే లిఫ్ట్‌తో పాటు గదిలోకి తగినంత వెలుతురు వస్తుందా? బెడ్స్, బాత్రూమ్ ఫ్లోర్స్ ఎలా ఉన్నాయి? వంటి విషయాలు ఒకటికి రెండుసార్లు అడిగి తెలుసుకోవాలి.
ఈ వార్తను కూడా చదవండి: ఇదోరకం మార్కెట్
ముఖ్యంగా అక్కడ ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవాలి. ఒకవేళ చలి ప్రాంతమైతే స్వెట్టర్లు, సాక్సులు, వాకింగ్ షూ, క్యాప్‌లు, జాకెట్స్ తీసుకెళ్లాలి. వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళితే... వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ప్యాక్ చేయాలి.
వయసు పైబడిన వారికి జీర్ణశక్తి అంతంత మాత్రంగానే ఉంటుంది. అందువల్ల ప్రయాణంలో ఏదిపడితే అది తింటే అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. వెళ్తున్న చోట దొరికే ఆహారం గురించి ముందే తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు డైట్ ప్లాన్ చేసుకోవాలి.
కొన్నిసార్లు అనుకోని సంఘటనల వల్ల ఎక్కాల్సిన విమానాన్ని అందుకోలేకపోవచ్చు లేదా చివరి నిమిషంలో ట్రిప్ క్యాన్సిల్ అవ్వొచ్చు. ప్రయాణ సమయంలో ఏదైనా అత్యవసర వైద్య సహాయం అవసరం పడొచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇబ్బందిపడకుండా ప్రయాణ బీమా తీసుకోవాలి.
రైలులో పెద్దల బెర్త్‌లు వాష్ రూమ్‌కి దగ్గరగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సివస్తే మధ్యలో విరామం తీసుకోవటం, రైల్లోగానీ, విమానంలోగానీ నాలుగైదు అడుగులు వేయడం ఎంతైనా అవసరం. చెప్పులు లేదా షూస్ వేసు కున్నా... సాక్సులు ధరిస్తారు కొందరు. అలాంటివారు మోకాలి పొడవుండే ‘కంప్రెషన్ సాక్సు’లు ఎంచుకోవడం మంచిది. ప్రయా ణంలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పాదాల్లో వాపు వచ్చినా... అవి సాగుతూ సౌకర్యంగా ఉంటాయి.
గంటలకొద్ది బస్సులో, విమానంలో ప్రయాణించాలంటే పెద్దవాళ్లకు కాస్త కష్టంగానే ఉంటుంది. అందుకే వారికోసం ప్రత్యేకంగా అదనపు లెగ్‌రూమ్ ఉన్న సీట్లను బుక్ చేయాలి. ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఫ్లైట్స్ ఎంచుకోవడం మంచిది. రైలులో ప్రయాణించాల్సి వస్తే లోవర్ బెర్త్ బుక్ చేయాలి.
పెద్దవాళ్ల బ్లడ్ గ్రూప్, హెల్త్ ఇన్సూరెన్స్, వ్యాక్సినేషన్ రికార్డ్, ఆరోగ్య సమస్యలు, శస్త్ర చికిత్సలకు సంబంధించిన వివరాలు... ఇలా అన్నింటిని ఫోన్‌లో భద్రపరుచుకోవాలి. ఒక సెట్ హార్డ్ కాపీ వెంట ఉంచుకోవడం కూడా ముఖ్యమే. అత్యవసర కాంటాక్ట్ నెంబర్లను ఒక కాగితం మీద రాసి పెద్దవాళ్ల వ్యాలెట్‌లో ఉంచాలి.
వీటిని మరవొద్దు...
- మందులు, మెడికల్ కిట్ వెంట ఉంచుకోవాలి. రోజువారి మందులతో పాటు జ్వరం, జలుబు, విరేచనాలు, ఒంటి నొప్పులకు సంబంధించిన మాత్రలు కూడా ప్యాక్ చేసుకోవడం మంచిది.
- మరీ తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమం.
- వీలైనంత తక్కువ లగేజ్‌తో ప్రయాణించాలి.
- పెద్దలకు వినికిడి సమస్యఉంటే హియరింగ్ ఎయిడ్, ఇయర్ ప్లగ్ (విమాన ప్రయాణాల్లో తప్పనిసరి), రీడింగ్ గ్లాసెస్, ఛార్జర్, పవర్ బ్యాంక్, వాటర్ బాటిల్, ఆరోగ్యకరమైన స్నాక్స్ వెంట తీసుకెళ్లాలి.
- పార్కులు, దేవాలయాలు, మ్యూజియాలు.. ఇలా నడవా ల్సిన ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పెద్దవాళ్లు చేతికర్ర సహాయం తీసుకోవడం మంచిది.
- ఎండ నుంచి రక్షణ కోసం సన్‌స్ర్కీన్, టోపీ, సన్‌గ్లాసెస్, పోర్టబుల్ గొడుగు పట్టుకెళ్లాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
పోస్టల్ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తారట..!
కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి
మెట్రో రైల్‌పై బెట్టింగ్ యాప్‌ల ప్రచారం ఆపండి
Read Latest Telangana News and National News