Share News

Food Noise Explained: మీది నిజమైన ఆకలేనా

ABN , Publish Date - Apr 05 , 2025 | 01:56 AM

ఫుడ్ నాయిస్ అనేది మన మానసిక అభిప్రాయం వల్ల ఆకలి అనిపించడం. దీన్ని ఎదుర్కోవటానికి సమతుల ఆహారం, ప్రోటీన్, ఫైబర్ మరియు మెగ్నీషియం ఉన్న ఆహారాలు తీసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు

Food Noise Explained: మీది నిజమైన ఆకలేనా

టీవీలోనో, బయట రెస్టారెంట్‌లోనో... రకరకాల ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చూడగానే మన ఆలోచనలు తినటం వైపు మళ్లుతాయి. ఇలా చూడగానే పదే పదే ఆహారాన్ని తినాలనిపించటాన్ని మానసిక నిపుణులు ‘ఫుడ్‌ నాయిస్‌’ అంటారు. మన మెదడులో ఆహారానికి సంబంధించిన ఆలోచనలు చేసే రణగొణ ధ్వని ఇది. దీనివల్ల బరువు తగ్గాలనుకున్నవారు తగ్గరు. పెరగాలని లేకపోయినా బరువు పెరుగుతారు. ఈ ఫుడ్‌ నాయి్‌సను ఎదుర్కోవటానికి మానసిక నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.

  • కొన్నిసార్లు శరీరంలోని బ్లడ్‌ షుగర్‌ విలువలు పెరుగుతూ... పడిపోతూ ఉంటాయి. దీనికి కారణం సమతుల ఆహారం తినకపోవటం. అలాంటి సమయంలో మన మెదడు ఆహారం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్ల ప్రతి రోజూ ప్రొటీన్‌, ఫైబర్‌, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి.

  • ఉదయాన్నే ఎక్కువ ప్రొటీన్‌ ఉన్న అల్పా హారం తినాలి. చీజ్‌, గుడ్లు, ప్రొటీన్‌ షేక్‌లు బ్రేక్‌ఫా్‌స్టలో తీసుకోవటంవల్ల రోజంతా శరీరంలో బ్లడ్‌ షుగర్‌ విలువలు తగ్గవు. అందువల్ల ఉదయాన్నే ఈ తరహా బ్రేక్‌ఫాస్ట్‌ చేయటం మంచిది.


  • కొందరు ఆకలి వేసిన వెంటనే చిప్స్‌ వంటివి తింటారు. దీనివల్ల ఆకలి తగ్గిన భావన కలుగుతుంది. వాస్తవానికి ఇది తాత్కాలికమే. కొద్ది సేపు అయిన వెంటనే మళ్లీ ఆకలి వేస్తుంది. ఆలోచనలన్నీ ఆహారం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆకలి అనిపించినప్పుడు కార్బోహైడ్రేట్స్‌, కొవ్వు లేదా ప్రొటీన్‌ ఉన్న ఆహారాన్నే తినాలి. ప్రమాదకరమైన రసాయనాలు కలిపిన ప్రొసెస్డ్‌ ఫుడ్‌ తినకూడదు.

  • మన పేగుల్లో ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఎక్కువగా లేకపోతే ఆకలి వేస్తున్నట్లు అనిపిస్తుంది. అందువల్ల ఈ బ్యాక్టీరియాను పెంపొందించే పెరుగు వంటివాటిని ఎక్కువగా తీసుకోవాలి.

  • మెగ్నీషియం తక్కువ అయితే ఎక్కువగా చక్కెర తినాలనిపిస్తుంది. అందువల్ల మెగ్నీషియం ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవటం మంచిది.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For  Telugu News

Updated Date - Apr 05 , 2025 | 01:56 AM