JD Vance Green Card: వాళ్లనీ బహిష్కరించొచ్చు.. గ్రీన్ కార్డుపై అమెరికా ఉపాధక్షుడి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 15 , 2025 | 08:33 AM
గ్రీన్ కార్డు అంటే అమెరికాలో నిరవధికంగా నివసించే హక్కు ఏమీ కాదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. వారిని దేశం నుంచి బహిష్కరించే హక్కు అమెరికా ప్రభుత్వానికి ఉందని అన్నారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ గ్రీన్ కార్డుపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డుతో అమెరికాలో నిరవధికంగా ఉండే హక్కు ఏమీ ఉండదని స్పష్టం చేశారు. గ్రీన్ కార్డు ఉన్న వారికి కూడా అమెరికా ప్రభుత్వం వారి స్వదేశాలకు పంపించగలదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రారంభించిన గోల్డ్ కార్డు ద్వారా అమెరికాలోకి వలసలు ప్రోత్సహించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
భారీ పెట్టుబడులు పెట్టే వారికి అమెరికాలోకి అనుమతించ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డు పేరిట కొత్త విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గోల్డ్ కార్డు కోసం విదేశీయులు సుమారు 5 మిలియన్ డాలర్ అమెరికాలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది (JD Vance on Green Card).
పాలస్తీనా అనుకూల నిరసనలు చేపట్టిన కొలంబియా యూనివర్సిటీ విద్యార్థిని సొంత దేశానికి పంపించే విషయమై జేడీ వ్యాన్స్ స్పందిస్తూ గ్రీన్ కార్డు ప్రస్తావన తెచ్చారు. అమెరికా సమాజంలో ఎవరిని చేర్చుకోవాలనే దానిపైనే తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. ‘‘ఓ గ్రీన్ కార్డు దారుడి నిరవధికంగా అమెరికాలో ఉండే హక్కు ఏమీ ఉండదు’’ అని వ్యాఖ్యానించారు. అమెరికా పౌరులకు, గ్రీన్ కార్డు దారులకు, స్టూడెంట్ వీసాదారుల హక్కుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని జేడీ వాన్స్ పేర్కొన్నారు.
TSN: టీఎస్ఎన్ ఉగాది 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతం
‘‘నా అభిప్రాయం ప్రకారం, ఇది భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించినది కాదు. ఇది జాతి భద్రతకు సంబంధించిన అంశం. అంతకంటే ముఖ్యంగా ఇది అమెరికా సమాజంలో ఎవరు భాగం కావాలో నిర్ణయించే అంశం’’ అని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఎవరు ఉండాలో నిర్ణయించే అధికారం అంతిమంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రికే ఉందని స్పష్టం చేశారు. ఇతరులకు దేశంలో ఉండేందుకు ప్రత్యేక చట్టపరమైన హక్కులేమీ లేవని అన్నారు.
TANA: 24వ తానా మహాసభల సర్వ కమిటీ సమావేశం
అమెరికా కాలేజీ క్యాంపస్‌లో పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులను బహిష్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు మొహమ్మద్ ఖలీల్ అనే విద్యార్థిని శనివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గ్రీన్ కార్డు విదేశీయులకు అమెరికాలో నివాసార్హత కల్పిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ కార్డు ఉన్న వారు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనంత వరకూ వారికి అమెరికా ఉంటూ ఉద్యోగ ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇక అమెరికాలోని విదేశీయుల్లో భారతీయులు సంఖ్యా పరంగా రెండో స్థానంలో ఉన్నారు. వీరిలో వేల మందికి ఇప్పటికే గ్రీన్ కార్డు పొందారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..