TDP: సెయింట్ లూయీస్‌లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
ABN , Publish Date - Apr 03 , 2025 | 09:43 PM
సెయింట్ లూయీస్‌లో టీడీపీ ఆవర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు కూన రవి కుమార్ (ఆమదాలవలస), కందుల నారాయణరెడ్డి (మార్కాపురం)లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సెయింట్ లూయిస్ నగరంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు కూన రవి కుమార్ (ఆమదాలవలస), కందుల నారాయణరెడ్డి(మార్కాపురం)లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ప్రస్తుత ప్రభుత్వ పాలన, భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల్లో ఎన్నారై టీడీపీ పోషించిన కీలక పాత్ర, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గ్లోబల్ తెలుగువారి పాత్ర వంటి అంశాలపై కార్యకర్తలు ప్రసంగించారు.
కిషోర్ యార్లగడ్డ (St. Louis TDP President), చెంచు వేణుగోపాల్ రెడ్డి (NRI TDP అధికార ప్రతినిధి), రాజ సూరపనేని (NRI TDP regional Coordinator), రజినీకాంత్ గంగవరపు (TDP Senior Leader), కిషోర్ యర్రపోతిన, సురేంద్ర బైరపనేని, శేషు, వెంకట్ గౌని, రవి పోట్ల, రామ్ కుమార్ లావు, విజయ్ బుడ్డి, సురెన్ పాతూరి, శ్రీకాంత్ సూరపనేని స్థానిక టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది వేడుకలు
ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి