Oman: ఒమాన్ టి.కె.యస్ ఎన్నికలలో అందరి భాగస్వామ్యం
ABN , Publish Date - Feb 19 , 2025 | 02:48 PM
ఒమాన్‌లోని తెలుగు కళా సమితిలో ఏ రకమైన ప్రాంతీయ లేదా సామాజిక భేదాభిప్రాయాలు లేవని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఒమాన్‌లోని తెలుగు కళా సమితిలో ఏ రకమైన ప్రాంతీయ లేదా సామాజిక భేదాభిప్రాయాలు లేవని తెలుగు కళా సమితి ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రాంతీయ, సామాజిక వర్గాలంటూ తమ సంఘం ఎన్నికల గురించి ఇటీవల వచ్చిన వార్తలను తెలుగు కళా సమితి కన్వీనర్ చిన్నారావు పూర్తిగా ఖండించారు (NRI).
తోటి ప్రవాసీలకు సాయపడ్డ తెలుగు మహిళకు దుబాయ్‌లో పురస్కారం
అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు చెందిన ప్రవాసీయులు కేవలం తెలుగు అనే ఏకైక అంశంతో ఎన్నికలలో పాల్గొని తమ తీర్పును ఇచ్చారని అందులో ఎక్కడ ఎలాంటి వివక్ష లేదా అధిపత్యానికి తావు లేదని ఆయన వివరించారు. కలిసి ఉంటే కలదు సుఖానికి ఒమాన్ తెలుగు కళా సమితి పూర్తిగా కట్టుబడి ఉండి తెలుగు వారందరి కోసం పని చేస్తుందని చిన్నారావు అన్నారు. అందరి కళ్ళ ముందు జరిగిన ఎన్నికల ప్రక్రియలో కేవలం ఒక్క ప్రాంతం వారి అధిపత్యం నడిచిందని చెప్పడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ అన్ని ప్రాంతాల వారు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసారు.
TKS: హోరాహోరీగా ఒమాన్ టి.కె.యస్ ఎన్నికలు!
తనతో సహా తమ సంఘం పక్షాన ఎవరు కూడా ఏ రకమైన ప్రకటనను లేదా ఫొటోలను సంప్రదాయ లేదా సామాజిక మాధ్యమాలకు జారీ చేయలేదని చిన్నారావు స్పష్టం చేసారు.
నూతన కార్యవర్గం కొలువు తీరిన తర్వాత తెలుగు కళా సమితి అధికారికంగా ప్రకటన జారీ చేస్తుందని అప్పటి వరకు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఎలాంటి ప్రకటనలు జారీ చేయవద్దని ఆయన అన్నారు.