Share News

Ugadi Celebrations in Hongkong: హంగ్‌కాంగ్‌లో వైభవంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు

ABN , Publish Date - Apr 07 , 2025 | 02:45 PM

ది హాంకాంగ్ తెలుగు సమాఖ్యలో ఆధ్వర్యంలో ఎన్నారైలు విశ్వావసు నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రముఖులు కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు.

Ugadi Celebrations in Hongkong: హంగ్‌కాంగ్‌లో వైభవంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
The Hong Kong Telugu Samakhya Ugadi Celebrations

హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకున్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (టీహెచ్‌కేటీఎస్) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా, పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవులు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు (THKTS Ugadi Celebrations).

ఈ కార్యక్రమానికి హాంకాంగ్ అండ్ మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ కూచిభొట్ల వెంకట రమణ; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి మొక్ మాంగ్-చాన్; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ కోనీ వాంగ్; హాంకాంగ్‌లోని ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి దేవేష్ శర్మ హాజరయ్యారు.

చీకటిని పారద్రోలడానికి, కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది. తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించేలా చేసింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం, దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. కూచిభొట్ల వెంకట రమణ తెలుగు భాష, సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ వీటిని భావి తరాలకు అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్‌కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.

1.jpg


తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన, సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం, దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, సమాజానికి తిరిగి ఇవ్వడం ప్రాముఖ్యతను ఆమె ఎంతో అవసరమని చెప్పారు. హాంకాంగ్, భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.

వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు, కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శనలిచ్చిన కళాకారులను కాన్సల్ కూచిభొట్ల వెంకట్ రమణ పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.

4.jpg


హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం, సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం, తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి తార్కాణం.

అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో, గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు. తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

4.jpg2.jpg

ఇవి కూడా చదవండి:

దుబాయిలో జై శ్రీరాం నినాదాలతో శ్రీ రామ నవమి ఉత్సవాలు

బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఒమాన్‌లో మెగాస్టార్ అభిమానుల రక్తదాన శిబిరం

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2025 | 02:49 PM