Telugu Tarangini Ugadi Celebrations: యూఏఈలో తెలుగు తరంగిణి ఉగాది ఉత్సవాలు
ABN , Publish Date - Apr 07 , 2025 | 10:18 PM
యు.ఎ.ఇలోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు తరంగిణి రాస్ అల్ ఖైమాలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఉగాది వేడుకలలో దుబాయితో పాటు వివిధ ఎమిరేట్ల నుండి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో ఏ తెలుగు పండుగ జరిగినా ఏ ఉత్సవం జరిగినా దారులన్నీ ఆ దిక్కే.. రాస్ అల్ ఖైమా వైపు. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో పండుగలు నిర్వహిస్తుండడంతో రాస్ అల్ ఖైమాకు వెళ్ళి జరుపుకోవడం పెరిగిపోతుంది. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ కొత్త చిగుళ్లు చిగురించే విధంగా శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణంతో యు.ఎ.ఇలోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు తరంగిణి రాస్ అల్ ఖైమాలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఉగాది వేడుకలలో దుబాయితో పాటు వివిధ ఎమిరేట్ల నుండి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు పాల్గొన్నారు.
దేశంలోని మిగిలిన ఎమిరేట్లతో పోల్చితే తెలుగు సాంస్కృతిక వైభవం ఉట్టిపడే విధంగా వైవిధ్య భరిత సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగలను రాస్ అల్ ఖైమాలోని తెలుగు తరంగిణి నిర్వహిస్తుందనే పేరుంది.
ప్రత్యేక పూజతో మొదలైన వేడుకలలో ఇస్కాన్ ప్రముఖులు గౌరాంగ దర్శన్ దాస్ ప్రభుజీ సద్గుణాలు, ఆధ్యాత్మికత, మనశ్శాంతిపై చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. నూతన సంవత్సరంలో ఆవిర్భవించవలసిన సత్ సంకల్పాలు ఆయన వివరించిన తీరు పట్ల సభికులు హర్షం వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా ఈద్ మిలాప్ కూడా నిర్వహించడం జరిగింది, అబ్దుల్ ఫహీమ్ షేక్ ప్రసంగిస్తూ సమాజంలో ఐక్యత, శాంతి, సామరస్యం గురించి వివరించారు. డాక్టర్ ఖాజా ఈద్, ఉగాది ఉత్సవాలను ఒకే వేదికపై తెలుగు ప్రజలతో కలిసి జరుపుకోవడం ఆనందకరమైన విషయమని వ్యాఖ్యానించారు.
ఉగాది పచ్చడి తయారీ కార్యక్రమంలో పెద్దల నుంచి చిన్నారుల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక వేద పండితులు, పురోహిత ప్రముఖులు ముకుంద్ కౌశిక్ పంచాంగ శ్రవణం జరిగింది. ఇందులో జ్యోతిష శాస్త్రం ఆధారంగా కొత్త సంవత్సరానికి సంబంధించిన వివరణలు అందించారు. ఇది భవిష్యత్తును సానుకూలంగా అంచనా వేసుకునేందుకు సందర్శకులకు మార్గదర్శిగా నిలిచింది. ఈ సందర్భంగా, ప్రవాసి తెలుగు మిత్ర అవార్డును వ్యాపారవేత్త సంపంగి సురేష్‌కు ప్రదానం చేశారు.
భరతనాట్యం, కూచిపూడి, అనేక నృత్య ప్రదర్శనలతో పాటు మారుతున్న తరం అభిరుచికి అనుగుణంగా పాశ్చాత్య నృత్య ప్రదర్శనలను కూడా నిర్వహించారు. కేవలం నృత్య, సంగీత ప్రదర్శనలే కాకుండా, సందర్శకుల కోసం అనేక వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా తంబోలా ఆట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబాలు, పిల్లలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ తెలుగు నేపధ్య గాయని కుమారి బృందా, సిద్ధార్థ్ వాట్కిన్స్ తమ పాటలతో సందడి చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్ అసోసియేషన్ చైర్మన్ ఎస్. ఎ. సలీమ్ తెలుగు తరంగిణి అధ్యక్షుడు డా. వక్కలగడ్డ వెంకట సురేష్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. దుబాయి తెలుగు ప్రముఖులు కే. విజయభాస్కర్ రెడ్డి, నూకల మురళీ కృష్ణ, తెలుగు అసోసియేషన్ అబుదాబి పక్షాన నారాయణ, ధనంజయ, రవి పాల్గొన్నారు. ఇస్కాన్, నన్మా , తమిళ మండ్రమ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐపీఎఫ్, కన్నడ అసోసియేషన్, సమన్వయ తదితర ప్రముఖ ప్రవాసీ సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఏపీఎన్ఆర్‌టీ ప్రాంతీయ సమ్యోజకులు పొడిపిరెడ్డి వాసు, మోహన్ మురళి, సౌదీ అరేబియా తెలుగు సంఘం (SATA) అధ్యక్షుడు మల్లేశన్ విశ్వనాథం, కువైట్ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు ప్రమోద్, న్యాయవాది వొబ్బిలిసెట్టి అనురాధ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు తరంగిణి కార్యనిర్వాహక వర్గం, ఉపాధ్యక్షులు శ్రీనివాస రావు, కోశాధికారి రాజేష్, ప్రధాన కార్యదర్శి నంద, బ్రహ్మ, రామ శేషు, వీర, లక్ష్మణ రావు, శరత్, వీరేంద్ర, శివానందం, సైదా రెడ్డి, కేదార్, విజయ్, అనిల్, కిరణ్, డా. రాఘవేంద్రలు వ్యవహారిస్తున్నారు. వీరందరి సేవారీతిని తెలుగు తరంగిణి అధ్యక్షులు డా. వక్కలగడ్డ వెంకట సురేష్ కోనియాడారు.
కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించిన సురేఖ పట్నంను అందరూ ప్రశంసించారు. అదే విధంగా తెలుగు తరంగిణి మహిళా విభాగ ప్రముఖులు అయిన శోభారాణి, విజయలక్ష్మి, తనూజ, వరలక్ష్మి, లక్ష్మి అనూశ, ప్రియాంక, రేవతి, హంసవేణి, భాగ్య శిరీష-, అనంతలక్ష్మి, ప్రణవి సేవలను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఇవి కూడా చదవండి:
హంగ్‌కాంగ్‌లో వైభవంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
దుబాయిలో జై శ్రీరాం నినాదాలతో శ్రీ రామ నవమి ఉత్సవాలు
బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

భారతీయులకు మరో దెబ్బ..ఈ వీసాల విషయంలో కీలక మార్పు..

డెన్మార్క్‌లో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

ఛార్లెట్‌లో ఘనంగా టీడీపీ ఎమ్మెల్యేల మీట్ అండ్ గ్రీట్

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు: టీజీఎమ్డీసీ చైర్మన్

పర్మెనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకోండి.. కెనడా ఆహ్వానం
