అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

ABN, Publish Date - Mar 20 , 2025 | 11:52 AM

కృష్ణా జిల్లా: రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బుధవారం హనుమాన్‌ జంక్షన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మల్లవల్లిలోని ఏపీఐఐసీ ఇండస్ర్టియల్‌ పార్కులో హిందూజా గ్రూప్‌ అనుబంధ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ స్థాపించిన ఎలక్ట్రికల్, డీజిల్‌ బస్సు బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ముందుగా ఇండస్ర్టియల్‌ పార్కుకు రోడ్డు మార్గాన వెళ్తూ.. మార్గం మధ్యలో అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు.

Updated at - Mar 20 , 2025 | 11:52 AM