Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మరో సంచలన కోణం
ABN, Publish Date - Apr 12 , 2025 | 01:12 PM
పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రవీణ్ విజయవాడకు చేరుకోవడానికి ముందే బుల్లెట్‌పై నుంచి అదుపుతప్పి పడిపోవడం నిజమని పోలీసుల దర్యాప్తులో తేలింది.

పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రవీణ్ విజయవాడకు చేరుకోవడానికి ముందే బుల్లెట్‌పై నుంచి అదుపుతప్పి పడిపోవడం నిజమని పోలీసుల దర్యాప్తులో తేలింది. పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నర్సింహ కిషోర్‌లు శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించారు.

ప్రవీణ్ మార్చి 24వ తేదీన మృతి చెందారని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని కేసు దర్యాప్తు చేశామని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు.

మార్చి 26వ తేదీన వైద్యులు పోస్టుమార్టం చేశారని అన్నారు. హైదరాబాద్ పోరెనిక్స్ ల్యాబోరేటరీకి పంపామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వచ్చే వరకు సీసీ పుటేజ్ అంతా సేకరించామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు.

ఆయన ఫోన్‌లో మాట్లాడిన వారందరిని విచారణ చేశామని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు. ఫోన్ పే చేసిన వివరాలు సేకరించామని తెలిపారు. కుటుంబ సభ్యులను విచారణ చేశామని ఐజీ అశోక్ కుమార్ అన్నారు.

ఈ కేసుపై ఎన్నో రకాలుగా విచారణ జరిపామనిఐజీ అశోక్ కుమార్ అన్నారు. దారి పొడవునా ప్రవీణ్‌ను గమనించిన వారిని, ఫోన్‌లో మాట్లాడిన వారందరినీ విచారణ చేశామని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.

ప్రవీణ్ చనిపోయిన స్థలాన్ని విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి ఆధారాలను సేకరించారని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు . అలాగే ప్రవీణ్ ప్రయాణించిన బైక్‌తో పాటు.. కొన్ని అనుమానాస్పదంగా ఉన్న బైక్‌లను కూడా ఎగ్జామిన్ చేసినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు.
Updated at - Apr 12 , 2025 | 01:23 PM